PM Modi: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. అభినందించిన ప్రధాని మోదీ
శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. రోదసీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. శుభాంశు శుక్లా సి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది.

శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. రోదసీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. శుభాంశు శుక్లా సి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి క్యాప్సుల్ విడిపోయి ఐఎస్‌ఎస్ దిశగా ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా వచ్చింది. ఇవాళ మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి ప్రయోగం విజయవంతమయ్యింది.
స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్ .. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు శుభాంశు శుక్లాను అభినందించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లా అని ప్రశంసించారు ప్రధాని మోదీ. యాక్సియం-4 ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నా భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది.. మీ సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో యాక్సియం-4 ప్రయాణం చేస్తోందన్నారు శుభాంశు శుక్లా.. ఈ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సందేశమిచ్చారు .. ప్రతి భారతీయుడి ఆశీస్సులు తనకు కావాలన్నారు. శుభాంశు శుక్లా స్వస్థలం లక్నోలో సంబరాలు అంబారన్ని తాకాయి. శుభాంశు పేరంట్స్ కళ్ల నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ .. ఇస్రో , అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరప్ అంతరిక్ష సంస్థలు ఇందులో కీలకపాత్ర పోషించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్) రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయన్ను ‘శుక్స్’గా పిలుస్తారు.
We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US.
The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…
— Narendra Modi (@narendramodi) June 25, 2025
28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) చేరుకుంటారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు. భారత్ గగన్‌యాన్‌కు శుభాంశు అంతరిక్ష యాత్ర ఎంతో ఉపయోగపడుతుంందని భావిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు.. ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. రోదసీలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. 984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత శుభాంశు శుక్లా మళ్లీ రోదసీ లోకి దూసుకెళ్లారు.
