AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ పెళ్లి అంటూ వేధింపులు.. తిరస్కారాన్ని తట్టుకోలేక.. ఏం చేశాడో తెలుసా?

ప్రేమ నిరాకరణతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఐదో అంతస్తు నుంచి యువతని తోసేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతినగర్‌లో జరిగన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం(జూన్ 23) రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండా నుండి పట్టుబడ్డాడు.

ప్రేమ పెళ్లి అంటూ వేధింపులు.. తిరస్కారాన్ని తట్టుకోలేక.. ఏం చేశాడో తెలుసా?
Delhi Murder
Balaraju Goud
|

Updated on: Jun 25, 2025 | 4:22 PM

Share
ప్రేమ నిరాకరణతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఐదో అంతస్తు నుంచి యువతని తోసేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతినగర్‌లో జరిగన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం(జూన్ 23) రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని టాండా నుండి పట్టుబడ్డాడు.
తౌఫిక్‌.. నేహాతో రోజూ మాట్లాడేవాడు. సోదరుడిగా భావించి ఆమె కూడా మాట్లాడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తౌఫిక్ వికృత స్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రేమ పెళ్లి అంటూ వేధించాడు. భరించలేక తౌఫిక్‌ను దూరం పెట్టింది నేహా. తిరస్కారాన్ని తట్టుకోలేక అవమానంతో రగిలిపోయాడు తౌఫిక్‌. తనకు తప్ప  మరెవ్వరికీ దక్కకూడదని భావించి చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
నేహా ఇంట్లోకి దొంగచాటుగా వెళ్లాడు తౌఫిక్‌. బుర్ఖా ధరించి వెళ్లిన అతన్ని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చాకచక్యంగా అతన్ని పక్కకు నెట్టి.. నేహా రూమ్‌లో వెళ్లాడు. పెళ్లి విషయమై మరోసారి నిలదీశాడు. అందుకు నేహా నిరాకరించడంతో.. ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అంత దూరం నుంచి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి నేహా చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో పనిచేశాడు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం పారిపోయిన తర్వాత, రాంపూర్‌లో పోలీసు బృందాలు అర్థరాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో అతన్ని ట్రాక్ చేసి అరెస్టు చేశాయి.
మైనర్‌ బాలికపై లైంగిక దాడి
మరోవైపు ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ఏరియాలో బాలికకు వేధింపుల ఘటన అక్కడున్న వాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఓ యువకుడు మైనర్‌పై లైంగిక దాడి చేశాడు. చేయి పట్టుకుని వదలకుండా ఎక్కడెక్కడో టచ్ చేశాడు. ఆమె వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఆ దుర్మార్గుడు వదల్లేదు. అటూ ఇటూ తిప్పుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఇది గమనించిన మరో యువకుడు అతన్ని వారించాడు. మధ్యలో నువ్వెవరంటూ కత్తితో దాడికి దిగాడు.
స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. దాడి చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చమన్‌గా గుర్తించారు. బాలికకు వేధింపులు.. కత్తితో దాడి.. రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరూ మైనర్లే కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక చమన్‌ బ్యాగ్రౌండ్‌ ఏంటి..? గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.