AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw – Kishan Reddy: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్‌రెడ్డి సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ

Ashwini Vaishnaw - Kishan Reddy: వేసవి కాలం, రాబోయే రుతుపవనాల సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి రైల్వే వ్యాగన్లలోకి బొగ్గును భారీగా లోడ్ చేసే ప్రక్రియను మరింత యాంత్రీకరించే మార్గాలపై బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయన్నారు..

Ashwini Vaishnaw - Kishan Reddy: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్‌రెడ్డి సమావేశం.. ఈ కీలక అంశాలపై చర్చ
Subhash Goud
|

Updated on: Jun 25, 2025 | 3:13 PM

Share

Ashwini Vaishnaw – Kishan Reddy: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది. అలాగే తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మే 2026 నుంచి కాజీపేట RMUలో ఈ MEMU కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. MEMU రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో.. మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వేమంత్రి తెలిపారు.

రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న కేంద్రమంత్రి.. 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని అన్నారు. అలాగే మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు అశ్విని వైష్ణవ్.

స్వల్ప, మధ్యస్థ దూర రైలు ప్రయాణాన్ని మెరుగుపరచడానికి భారత రైల్వే కొత్త తరం మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డికి తెలిపారు. 16-20 కోచ్‌లతో కూడిన కొత్త MEMU రైళ్లు తెలంగాణలోని కాజీపేటలోని రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU)లో తయారు అవుతాయి. ముఖ్యంగా పండుగ సీజన్లలో నాన్-అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాలకు సేవలు అందిస్తాయి.

వేసవి కాలం, రాబోయే రుతుపవనాల సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి రైల్వే వ్యాగన్లలోకి బొగ్గును భారీగా లోడ్ చేసే ప్రక్రియను మరింత యాంత్రీకరించే మార్గాలపై బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయన్నారు.

సిలో లోడింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టింది. సిలో లోడింగ్ అంటే ఫ్రంట్-ఎండ్ లోడర్లు లేదా మాన్యువల్ పార వంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించకుండా, నిల్వ సిలోల నుండి రైల్వే వ్యాగన్లలోకి బల్క్ మెటీరియల్ (బొగ్గు వంటివి) నేరుగా లోడ్ చేసే యాంత్రిక ప్రక్రియ. సిలో లోడింగ్ ఏకరీతి బొగ్గు పరిమాణాన్ని నిర్ధారిస్తుంది. విద్యుత్ ప్లాంట్ల నుండి భారీ రాళ్లకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. వ్యాగన్లకు నష్టాన్ని తగ్గిస్తుంది.

అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 61.3 మిలియన్ టన్నుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది 25 రోజుల వినియోగానికి సరిపోతుంది. ఈ రికార్డు నిల్వ భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. వేసవి నెలల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారిస్తుంది. అలాగే భారీ వర్షపాతం కారణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా తరచుగా సవాళ్లను ఎదుర్కొనే రాబోయే రుతుపవనాల కాలానికి తగిన నిల్వలు ఉంటాయని కేంద్రం మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి