AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

ఉదయపూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిగరేట్ తాగుదామని చెప్పి మాయమాటలతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిందితుడు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను సినిమాల్లో కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..
Pushparaj
SN Pasha
|

Updated on: Jun 25, 2025 | 2:31 PM

Share

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిగరేట్‌ తాగుదామంటూ రూమ్‌కు తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని చిత్తోర్‌గఢ్‌లోని గంగారార్‌లో అరెస్టు చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ యోగేష్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌కు చెందిన ఒక మహిళ 2 రోజుల క్రితం తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. సిగరేట్‌ తాగుదామని చెప్పి తనను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసులో విదేశీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుల కోసం వెతకడానికి పోలీసులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు నిందితుడు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు.

జూన్ 22న విదేశీ మహిళ ఉదయపూర్‌కు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు చిత్తోర్‌గఢ్‌లోని గంగారార్ నివాసి అని, సినిమాలు, యాడ్ సాంగ్స్, సీరియల్స్‌లో కాస్టింగ్ వర్క్ చేస్తున్నాడని తేలింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ల సినిమాల్లో కూడా కాస్టింగ్ వర్క్ చేస్తున్నాడు. ఒక మొబైల్ కంపెనీకి సంబంధించిన ప్రకటన కోసం విదేశీ మహిళ జూన్ 22న ఉదయపూర్‌కు వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మాయమాటలు చెప్పి.. రూమ్‌కి తీసుకెళ్లి..

టైగర్ హిల్‌లోని ‘గ్రీక్ ఫామ్ అండ్ రెస్ట్రో కేఫ్’లో జరిగిన పార్టీ సందర్భంగా, విదేశీ మహిళ నిందితుడు సిద్ధార్థ్ అలియాస్ పుష్పరాజ్‌తో చాలా సేపు మాట్లాడింది. దీని తర్వాత అతను ఆ మహిళను ఆకర్షించి, సిగరేట్‌ తాగుదాం అంటూ తన కారులో తన అద్దె ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం