Home Theatre Explosion: వరుడి ప్రాణం తీసిన పెళ్లి కానుక.. సెకన్ల వ్యవధిలో తీరని నష్టం..

పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌ పేలి నవ వరుడు, అతని సమీప బంధువు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఆదివారం (ఏప్రిల్‌ 2) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Home Theatre Explosion: వరుడి ప్రాణం తీసిన పెళ్లి కానుక.. సెకన్ల వ్యవధిలో తీరని నష్టం..
Home Theatre Explosion

Updated on: Apr 04, 2023 | 7:25 AM

పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌ పేలి నవ వరుడు, అతని సమీప బంధువు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఆదివారం (ఏప్రిల్‌ 2) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కవర్ధా జిల్లా రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి రెండు రోజుల క్రితం (మార్చి 31) పెళ్లి జరిగింది. పెళ్లి వచ్చిన అతిథులు రకరకాల కానుకలను బహుమతిగా ఇచ్చారు. అలా బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌ను వరుడు హేమేంద్ర ఆదివారం బయటికి తీసి విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చాడు. వెంటనే హోం థియేటర్‌ పేలిపోయింది. దీంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కనే ఉన్న అతని బంధువు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు దారితీసిన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.