హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు.. ఆ భయానక దృశ్యాలు ఎలా ఉన్నాయంటే…

గురువారం రాత్రి బియాస్ నది కూడా ప్రమాదకరంగా ఉప్పొంగడంతో, మనాలి సమీపంలోని నెహ్రూ కుండ్ మరియు బాంగ్ నివాసితులు వరదల భయంతో హై అలర్ట్‌గా ఉండాల్సి వచ్చింది. ఈ ప్రాంతం అంతటా వర్షాలు కొనసాగుతున్నందున నివాసితులు, పర్యాటకులు అనవసర ప్రయాణాలను నివారించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు.. ఆ భయానక దృశ్యాలు ఎలా ఉన్నాయంటే...
Himachal Landslides

Updated on: Aug 01, 2025 | 12:05 PM

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కార‌ణంగా అక్కడ కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కొండచరియలు విరిగిపడటంతో మండి- కులు హైవే మూసివేశారు. దీంతో రోడ్డు రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం(SEOC) ప్రకారం, గురువారం నాడు 291 రోడ్లు దిగ్భంధించబడ్డాయి. మండి జిల్లాలో అత్యధికంగా 171 రోడ్లు వరదలతో స్తంభించిపోయాయి. గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదల్లో విస్తృతంగా నష్టపోయిన జిల్లా మండినే. ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. మండిలోని సెరాజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 70 రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత థాలౌట్‌35, ధరంపూర్‌ 25, కర్సోగ్‌ 18 ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

నదులు, వాగులలో నీటి మట్టాలు పెరగడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా కోల్ ఆనకట్ట వరద గేట్లను తెరిచారు. సైంజ్ లోయ (కులు జిల్లా)లోని గడా పర్లి పంచాయతీలో, వరద నీరు వంతెనలు, రోడ్లను తుడిచిపెట్టుకుపోయింది. సుమారు నాలుగు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. గురువారం రాత్రి బియాస్ నది కూడా ప్రమాదకరంగా ఉప్పొంగడంతో, మనాలి సమీపంలోని నెహ్రూ కుండ్ మరియు బాంగ్ నివాసితులు వరదల భయంతో హై అలర్ట్‌గా ఉండాల్సి వచ్చింది. ఈ ప్రాంతం అంతటా వర్షాలు కొనసాగుతున్నందున నివాసితులు, పర్యాటకులు అనవసర ప్రయాణాలను నివారించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…