ఇప్పటికే చమురు ధరలు పెరిగి లభోదిభోమంటున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు లాంటి వార్త పడింది. లీటర్ డీజిల్ ధరపై దాదాపు రూ.7.40 వ్యాట్ పెంచుతున్నట్లు ఆదివారం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీజిల్ ధర 6.40 శాతం నుంచి 9.96 శాతానికి చేరుకుంది. ఆ రాష్ట్రంలో ఒక లీటరు డీజిల్ ధర 83 నుంచి 86 రూపాయలకు చేరుకుంది. ఈ మేరకు తెలియజేస్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్రకటన వెలువరించింది.
కాగా డీజిల్ రేట్లు పెంచిన రోజునే (ఆదివారం) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు మంత్రులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో సిమ్లాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.