High Alert: కొచ్చి సముద్రతీరంలో మునిగిన భారీ నౌక.. ప్రమాదకర రసాయనాలు లీకైనట్టు అనుమానం.. హై అలర్ట్ ప్రకటన!

కొచ్చి తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లైబీరియా దేశానికి చెందిన ఓ భారీ సరకు రవాణా నౌక కొచ్చి తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. దీన్ని గమనించిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు నౌకలో ఉన్న సిబ్బందిని రక్షించారు. అయితే నౌకలో భారీగా రయాయనాలు ఉండడంతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

High Alert: కొచ్చి సముద్రతీరంలో మునిగిన భారీ నౌక.. ప్రమాదకర రసాయనాలు లీకైనట్టు అనుమానం.. హై అలర్ట్ ప్రకటన!
Hazardous Cargo

Updated on: May 25, 2025 | 5:26 PM

లైబీరియా దేశానికి చెందిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్‌సీ ఎల్సా-3 నౌక శుక్రవారం విఝింజం పోర్టు నుంచి బయలుదేరింది. అయితే ఈ నౌక, శనివారం మధ్యాహ్నం నాటికి కొచ్చిన్‌ ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది. అయితే, కొచ్చి తీరానికి ఇంకా 38 నాటికల్‌ మైళ్ల దూరం ఉండగా ఈ నౌక ప్రమాదానికి గురైంది. పడవ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని ఇండిన్ కోర్టు గార్డు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

అయితే, ప్రమాదానికి గురైన నౌకలో మొత్తం 640 కంటెయినర్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో 13 కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని.. 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్, మిగతా కంటెయినర్స్‌లో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్‌ గుర్తించారు. ఈ రసాయనాలు లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొచ్చి తీరం ప్రజలను హై అలర్ట్‌ చేశారు. ఒకవేళ నౌకలోని కంటెయినర్స్‌ లీకై ఆ రసాయనాలు సముద్రంలో కలిసి ఈ రసాయనాలు తీరం వైపునకు కానీ వస్తే వాటిని ప్రజలు, మత్స్యకారులు ఎవరూ తాకొద్దని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరకలు జారీ చేసింది.

కంటెయినర్లను నుంచి లీకైన ఇందన సముద్ర జలాల్లో ఎంతమేర వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ’ ని వినియోగించే విమానం సముద్రంపై తిరుగుతూ ఉందని కోస్ట్‌ గార్డ్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..