AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: పోస్టల్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా హేమమాలిని.. బీజేపీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు..

తపాలా శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని నియమించాలని మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి కున్వర్ విజయ్ షా సిఫారసు చేశారు. పోస్టాఫీస్ పెట్టుబడి, పొదుపు పథకాల విజిబిలిటీ పెంచడం కోసం ఆయన ఆ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో ప్రముఖ గిరిజన నేత, హర్సుద్ (ఖాండ్వా) నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ షా ప్రస్తుతం డాక్టర్ మోహన్ యాదవ్ కేబినెట్లో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 

Madhya Pradesh: పోస్టల్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా హేమమాలిని.. బీజేపీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు..
Mp Minister1
Balu Jajala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 14, 2024 | 7:01 PM

Share

తపాలా శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని నియమించాలని మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి కున్వర్ విజయ్ షా సిఫారసు చేశారు. పోస్టాఫీస్ పెట్టుబడి, పొదుపు పథకాల విజిబిలిటీ పెంచడం కోసం ఆయన ఆ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో ప్రముఖ గిరిజన నేత ఈయన హర్సుద్ (ఖాండ్వా) నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ షా ప్రస్తుతం డాక్టర్ మోహన్ యాదవ్ కేబినెట్లో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఖాండ్వా జిల్లాలో పోస్టాఫీస్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. 7.5% వడ్డీ రేటును అందించే పోస్టాఫీసులు అందించే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేస్తూ, ఈ పథకాలను మరింత మెరుగ్గా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉన్న హేమమాలిని ఈ ఆర్థిక సేవలకు అనువైన ప్రతినిధిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. హేమమాలిని మచ్చలేని సినీ జీవితాన్ని కొనసాగించారని..  పార్లమెంటు సభ్యురాలిగా ఆమె పలు పర్యాయాలు పనిచేశారని మంత్రి కొనియాడారు.

మాలిని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే బ్యాంకు ఖాతాదారుల నుంచి పోస్టాఫీస్ లకు నిధులను ఆకర్షించడం ద్వారా డిపాజిట్లను గణనీయంగా పెంచుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సూచనతో పోస్టాఫీసు సహకార, జాతీయ బ్యాంకులను అధిగమించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. పోస్టాఫీస్ ప్రధాని మోడీ సొంత కుమారుడితో సమానమని కూడా ఆయన అన్నారు. మంత్రి ఈ ప్రతిపాదన సభికుల్లో నవ్వులను తెప్పించాయి. బీజేపీ మంత్రలు ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు.. గతంలో అనేక మంత్రులు వివాదస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. కానీ ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం సానుకులంగా ఉన్నాయి. పోస్టల్ డిపార్ట మెంట్ సేవలు విస్తరించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని స్థానికులు అంటున్నారు.