Monsoon: బయలుదేరిపోయిన నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకేది అప్పుడే

నైరుతి రుతు పవనాలు బయలుదేరిపోయాయి. శుక్రవారం రోజున ఇవి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ నాలుగో తేదీ నాటికి ఈ రుతు పవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు.

Monsoon: బయలుదేరిపోయిన నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకేది అప్పుడే
Monsoon

Updated on: May 21, 2023 | 4:15 AM

నైరుతి రుతు పవనాలు బయలుదేరిపోయాయి. శుక్రవారం రోజున ఇవి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ నాలుగో తేదీ నాటికి ఈ రుతు పవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంవైపు వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి.

దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగగా.. ద్రోణి ప్రభావంతో ఆదివారం దక్షిణ, తూర్పు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . శుక్రవారం కూడా ఈ జిల్లాలోని దామరచర్లలో 45.4, నేరేడుగొమ్ములో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.4, నిర్మల్‌ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌,జగిత్యాల,సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో సుమారు 44.3 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us