Chennai rain: వరద పోటెత్తింది.. సిటీ జలమయమైంది.. బిక్కు బిక్కుమంటున్న చెన్నై మహానగరం..

|

Dec 30, 2021 | 10:01 PM

వరద పోటెత్తింది. సిటీ జలమయమైంది. మహానగరం విలవిల్లాడుతోంది. కుండపోత వానతో నగర జనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెన్నైలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షంతో నగరం జలదిగ్బంధంగా మారింది.

Chennai rain: వరద పోటెత్తింది.. సిటీ జలమయమైంది.. బిక్కు బిక్కుమంటున్న చెన్నై మహానగరం..
orange alert
Follow us on

వరద పోటెత్తింది. సిటీ జలమయమైంది. మహానగరం విలవిల్లాడుతోంది. కుండపోత వానతో నగర జనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెన్నైలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షంతో నగరం జలదిగ్బంధంగా మారింది. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచింది. వాహనదారులు నరకయాతన పడుతున్నారు. సరిగ్గా.. సాయంత్రం వేళ వాన కురియడంతో ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. ఇంటికెళ్లే సమయాన.. మోకాళ్ల లోతు నీళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నగర జనం. ఈ భారీ వర్షం కారణంగా నగరం దాదాపుగా స్తంభించింది. రహదారుల్లో వర్షపు నీరంతా వెల్లువలా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం సాయంత్రం కల్లా జడివానగా మారింది.

రహదారులు, పల్లపు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వర్షంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో గమ్యస్థానం చేరుకోలేకపోయారు. రహదారుల్లో అడగులోతున వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. పలుచోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షం కారణంగా నగరంలో విద్యుత్‌ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సిటీ బస్సులన్నీ తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులతోనే నడిచాయి. పలు రహదారుల్లో ద్విచక్రవాహనాలు వాన నీటిలో కదలకుండా మొరాయించాయి. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరమంతటా చీకట్లు అలముకున్నాయి. పగటిపూటే లైట్లు వేసుకుని కార్లు, మోటారు బైకులు నడపాల్సి వచ్చింది.

భారీ వర్షాల నేపథ్యంలో.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరో 4 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్టు హెచ్చరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం సహా.. చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. వరద బీభత్సంతో సిటీలో సబ్‌వేలు మూసేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి: Resume CV and Biodata: ఈ సంగతి మీకు తెలుసా.. రెజ్యూమ్, సీవీ మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..

New Year 2022 Vastu Tips: ఈ కొత్త సంవత్సరాన్ని ఇలా ఆహ్వానించండి.. ఇలా చేస్తే లక్ మీ వెంటే..