Monkeypox Virus: కరోనా మహమ్మారి పీడ పోకముందే.. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అమెరికా, యూరప్, ఆఫ్రికన్ దేశాలలో భయాందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. మంకీపాక్స్ వ్యాధి నిర్వహణపై మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ వైరస్ ఎలుకల నుంచి సోకిన జీవుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూకే, కెనడా, నైజీరియా, స్పెయిన్, పోర్చుగల్ లో కూడా మంకీపాక్స్ కేసులు బయట పడ్డాయి. అయితే.. ఈ మంకీపాక్స్ వైరస్ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు. దీని తీవ్రత వల్ల జ్వరం, అనారోగ్యం, సాధారణ ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కణాల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని ఇన్ఫెక్షన్ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే కలుషితమైన దుస్తులు, గాలి బిందువుల ద్వారా సంక్రమించే అవకాశముందని అమెరికన్ సీడీసీ, డబ్య్యూహెచ్ఓ పేర్కొంటున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..