కన్ను పోయింది.. కానీ.. కలం గెలిచింది.. జామియా విద్యార్ధిదే ఘనత

సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో అతని కన్ను పోయింది. వివరాల్లోకి వెళ్తే.. బుధ్దిగా యూనివర్సిటీ లైబ్రరీలో  ఏదో పేపర్ రాసుకుంటున్నాడు మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి.. .. అప్పుడే ఆ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. వారి లాఠీల్లో ఒకటి అతని ఎడమకంటికి బలంగా తగిలింది. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్  కంటి చూపు పోయింది. ఇంతకీ అతడు రాస్తున్న […]

కన్ను పోయింది.. కానీ.. కలం గెలిచింది.. జామియా విద్యార్ధిదే ఘనత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 20, 2020 | 3:14 PM

సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో అతని కన్ను పోయింది. వివరాల్లోకి వెళ్తే.. బుధ్దిగా యూనివర్సిటీ లైబ్రరీలో  ఏదో పేపర్ రాసుకుంటున్నాడు మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి.. .. అప్పుడే ఆ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. వారి లాఠీల్లో ఒకటి అతని ఎడమకంటికి బలంగా తగిలింది. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్  కంటి చూపు పోయింది. ఇంతకీ అతడు రాస్తున్న పేపర్.. ఏమిటంటే.. అది మానవహక్కులకు సంబంధించినది. డాక్టర్ల వద్దకు వెళ్లగా అతని కంటిని  పరీక్షించిన వారు ఇక శాశ్వతంగా చూపు రాదని స్పష్టం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు లాఠీ తనపై విరగడానికి కేవలం కొద్ది నిముషాల ముందే మిన్హాజుద్దీన్ తన వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కంటి చూపు కోల్పోయి తలనొప్పి ఎంతగా బాధిస్తున్నా.. ఆ పేపర్ కి తుదిమెరుగులు దిద్ది తన యూనివర్సిటీ అధ్యాపకుల సంఘానికి సమర్పించాడు. రెండు నెలలు గడిచిపోయాయి. మానవ హక్కులపై మిన్హాజుద్దీన్ రాసిన ఆర్టికల్ కే  ఉత్తమమైనదిగా జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఆ విద్యార్ధి పొంగిపోలేదు. మానవ హక్కులు రోజురోజుకీ  ఎందుకిలా  దిగజారిపోతున్నాయా అన్నదే ఇప్పుడా 26 ఏళ్ళ విద్యార్ధి మనోవేదన !  ఒక చట్టానికి నిరసనగా ఆందోళన చేసినంత మాత్రాన ఎక్కడో లైబ్రరీలో ఉన్న తనలాంటి విద్యార్థుల మీద పోలీసు లాఠీ విరగడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..