Tamil Nadu: తారాస్థాయికి గవర్నర్-సీఎం పంచాయితీ.. హ్యాష్ ట్యాగ్ అవుతున్న గెట్ అవుట్ గవర్నర్ నినాదం..
ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. అక్కడ ఓ ముఖ్యమంత్రి ఉంటారు. పరిపాలన వ్యవస్థలో కీలక నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు అంతిమ ఆమోదం ఆ రాష్ట్ర గవర్నర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు వచ్చి వివాదంగా మారాయి. ఇప్పుడు అలాంటి వివాదమే జరుగుతోంది.

ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. అక్కడ ఓ ముఖ్యమంత్రి ఉంటారు. పరిపాలన వ్యవస్థలో కీలక నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు అంతిమ ఆమోదం ఆ రాష్ట్ర గవర్నర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు వచ్చి వివాదంగా మారాయి. ఇప్పుడు అలాంటి వివాదమే జరుగుతోంది తమిళనాడులో.. వివాదం అనడం కంటే గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ఉన్న వార్ నెక్స్ట్ లెవల్కు చేరింది అనాలేమో..!
తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఇపుడు మరింత ముదురింది. ఇంకా చెప్పాలంటే బరెస్ట్ అయ్యిందని చెప్పొచ్చు. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇదే ఇద్దరి మధ్య మనస్పార్థలకు కారణమవుతోంది.
ఇదే అంశంపై బహిరంగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ ఏడాది జనవరి గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అక్కడ ఉన్న అంశాలను చదవకపోగా లేని అంశాలను ప్రస్తావించారు. అది కాస్తా వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నా దురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది.. తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డీఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టడంతో అర్దాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.
ఆ సందర్భంలో తమిళ సంఘాలు, డీఎంకే సహా పలు రాజకీయ పార్టీల నేతలు గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లు వేశారు. ఇప్పుడు మరోసారి గవర్నర్ రవి తీరును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా గెట్ అవుట్ రవి అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకు కారణం అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించక పోవడమే కారణం. ఏడాది నుంచి పది తీర్మానాలు గవర్నర్ ఆమోదం కోసం పంపినా ఎలాంటి ఫలితం లేదు. దీనిపై సుప్రీంకోర్టును కూడా డీఎంకే ప్రభుత్వం ఆశ్రయించింది. ఒకసారి ఆమోదం కోసం పంపిన బిల్లు పెండింగ్ లో ఉంటే తిరిగి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి చట్టబద్దత వస్తుంది. ఆ అధికారం అసెంబ్లీకి ఉంటుంది. రెండో సారి తీర్మానం చేసేదాక గవర్నర్ స్పందించక పోవడంపై అగ్రహిస్తూ గెట్ అవుట్ రవి అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. తమిళనాట ఇప్పుడు ఇది హ్యాష్ ట్యాగ్ గా మారింది.
అయితే గవర్నర్ పెండింగ్ లో ఉంచిన బిల్లులో అత్యధికంగా గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టే బిల్లులు కూడా ఉన్నాయి. యూనివర్శిటీలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్ నియామకాలను చేసేదీ గవర్నర్. అలాంటి అధికారాలకు కత్తెర వేస్తూ బిల్లును తీసుకొచ్చింది స్టాలిన్ ప్రభుత్వం. గవర్నర్ అధికారాలకే చెక్ పెడుతూ వాటికే ఆమోదం చేయాలంటే అదెలా అంటున్నాయి రాజ్ భవన్ వర్గాలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…