
హర్యానాలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ ప్రాంతంలో తనూ అనే మహిళ దారుణ హత్యు గురైంది. హత్య చేసి ఆమె ఇంటి సమీపంలోనే పూడ్చిపెట్టారు. యువతిని ఆమె భర్త, మామ కలిసి దారుణానికి ఒడిగట్టారు. అంతేకాదు పోలీసులను మోసం చేయడానికి మహిళ కనిపించటంలేదంటూ.. మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ తరువాత, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసుల దర్యాప్తులో మహిళ హత్య బయటపడింది.
తనూ అనే యువతితో అరుణ్ సింగ్ అనే వ్యక్తి జూన్ 21, 2023న వివాహం చేసుకున్నారు. తనూ కనిపించడం లేదని అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని ఆధారాలు సేకరించారు. అయితే చివరికి బాధితురాలిని ఆమె మామ భూప్ సింగ్ గొంతు కోసి చంపి ఇంటి ముందు ఉన్న గుంతలో పాతిపెట్టాడని వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తారు.
తను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్ నివాసి. తనూ తండ్రి హకీమ్ ఆమె అత్తమామలపై హత్య, వరకట్న వేధింపుల ఆరోపణలు చేశారు. పెళ్లి అయినప్పటి నుండి, తన కుమార్తెను కట్నం కోసం వేధిస్తున్నారని. నిరాశ చెందిన తన కుమార్తె ఒక సంవత్సరం పాటు తన తల్లి ఇంటికి వచ్చింది. ఆ తరువాత, పంచాయతీ ఈ విషయాన్ని పరిష్కరించింది. ఆ తర్వాత ఆమె తన అత్తమామల ఇంటికి తిరిగి వెళ్ళింది.
పోలీసుల కథనం ప్రకారం, ఏప్రిల్ 23న అరుణ్ సింగ్, అతని తండ్రి భూప్ సింగ్ ఇంటి సమీపంలోని రోడ్డు దగ్గర 10 అడుగుల లోతు గల గొయ్యిని JCB ఉపయోగించి తవ్వి, మరుసటి రోజు దానిని మళ్ళీ నింపారు. తనూను గొంతు కోసి చంపి, ఆ తర్వాత అదే గుంతలో పడేశారు. ఈ కేసులో ఏప్రిల్ 25న మిస్సింగ్ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల ముందు, తను మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని ఆమె అత్తమామలు చెప్పారు.
తన కూతురు అదృశ్యం గురించి తెలుసుకున్న తనూ తండ్రి హకీమ్ తన అల్లుడు అరుణ్ సింగ్ ఇంటికి చేరుకున్నాడు. తవ్విన మట్టిని చూశాడు. ఆ తర్వాత అతనికి అనుమానం మరింత బలపడింది. పోలీసుల నుండి దర్యాప్తు కోరినప్పటికీ పోలీసులు ఆలస్యం చేస్తూనే ఉన్నారు. చివరకు, గత శుక్రవారం(జూన్ 20), పోలీసుల సమక్షంలో గొయ్యి తవ్వి, తనూ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
#WATCH | Faridabad, Haryana | ACP Rajesh Kumar Lohan says, "Tanu and Arun got married on 21 June, 2023. We got a missing report of Tanu that was filed by Arun. Police took cognisance and received some tip-offs from the family. The matter surfaced that Bhoop Singh, father-in-law… pic.twitter.com/eXibLnQrgq
— ANI (@ANI) June 21, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..