AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక్క వలకు జాలరి సుడి తిరిగిపోయింది… వలలో ఏం పడ్డాయో తెలుసా..?

ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నానీ గోపాల్ అనే మత్స్యకారుడి సుడి తిరిగిపోయింది. ఓ రేంజ్‌లో లక్ కలిసొచ్చింది. దిఘా నదీ ముఖద్వారంలో అతను విసిరిన వలలో అరుదైన తెలియా భోలా చేపలు చిక్కాయి. అవి కూడా రెండు, మూడు కాదండోయ్.. ఏకంగా 29 చేపలు...

Viral Video: ఒక్క వలకు జాలరి సుడి తిరిగిపోయింది... వలలో ఏం పడ్డాయో తెలుసా..?
Telia Bhola Fish
K Sammaiah
|

Updated on: Jun 21, 2025 | 8:04 PM

Share

ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నానీ గోపాల్ అనే మత్స్యకారుడి సుడి తిరిగిపోయింది. ఓ రేంజ్‌లో లక్ కలిసొచ్చింది. దిఘా నదీ ముఖద్వారంలో అతను విసిరిన వలలో అరుదైన తెలియా భోలా చేపలు చిక్కాయి. అవి కూడా రెండు, మూడు కాదండోయ్.. ఏకంగా 29 చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా బరువు ఉంది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

ఈ చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నదీముఖద్వారంలోని చేపల వేలం కేంద్రంలో ఈ చేపలు రూ.33 లక్షల ధరకు అమ్ముడయ్యాయి.

తెలియా భోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలోని ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల తీవ్రమైన వ్యాధుల మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా సౌందర్య సాధనాల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంఘటన ఆ జాలరి జీవితానికి కీలక మలుపు తీసుకొచ్చింది. నానీ గోపాల్ ఇక తన కుటుంబానికి ఎటువంటి ఢోకా లేదని చెబుతున్నాడు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించింది. ఆ గంగమ్మ ఆశీస్సులు తమకు కూడా దక్కాలని వారు కోరుకుంటున్నారు.

వీడియో చూడండి: