Haryana Election 2024: మాయావతి వారసుడు ఆకాష్ ఆనంద్ కోసం కొత్త ఫార్ములా.. వర్కౌట్ అయ్యేనా..?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి వారసుడు ఆకాష్ ఆనంద్ కోసం ప్రత్యేక వ్యూహరచన చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా కీలక మార్పు చేసింది. ఆకాష్ ఆనంద్‌కు పార్టీ కొత్త దిశానిర్దేశం చేసింది.

Haryana Election 2024: మాయావతి వారసుడు ఆకాష్ ఆనంద్ కోసం కొత్త ఫార్ములా.. వర్కౌట్ అయ్యేనా..?
Mayawati, Akash Anand
Follow us

|

Updated on: Sep 17, 2024 | 2:00 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి వారసుడు ఆకాష్ ఆనంద్ కోసం ప్రత్యేక వ్యూహరచన చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా కీలక మార్పు చేసింది. ఆకాష్ ఆనంద్‌కు పార్టీ కొత్త దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు ఆకాష్ ఆనంద్ పెద్ద పెద్ద సమావేశాలు, ర్యాలీలకు బదులుగా నేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజలతో తనను తాను కనెక్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఆకాష్. ఇందుకోసం పెద్దపెద్ద సభలు పెట్టకుండా ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి కలుస్తూ బీఎస్పీకి మద్దతుగా కోరేందుకు ప్రయత్నిస్తారు. ఆకాష్ ఆనంద్ ఒక రోజులో రెండు కార్నర్ మీటింగ్ నిర్వహస్తారని బీఎస్‌పీ పేర్కొంది.

హర్యానా ఎన్నికల్లో బీఎస్‌పి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అంటే ఐఎన్‌ఎల్‌డితో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ ఈ ఎన్నికల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని, హర్యానా నుంచి యూపీకి బలహీన పడొద్దని సందేశం పంపేందుకు ప్రయత్నిస్తోంది. జూన్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో BSPకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఆ పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో 29 ఏళ్ల ఆకాష్ ఆనంద్ యూపీలో అనేక ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. అయితే, అతన్ని ‘పరిపక్వత లేని వ్యక్తి’ అంటూ మాయావతి అతని కార్యకలాపాలను కొంతకాలం దూరం పెట్టారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం మాయావతి మళ్లీ ఆయనకు బాధ్యతలు అప్పగించి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 29 ఏళ్ల ఆకాష్ ఆనంద్ పేరు చేర్చింది. జాబితాలో మాయావతి, ఆమె తండ్రి ఆనంద్ కుమార్ తర్వాత అతని పేరు ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన చేసిన ర్యాలీలతో పోలిస్తే ఆకాష్ ఆనంద్ ఇటీవలి ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. BSP ఈ కొత్త వ్యూహం ప్రకారం, ఆకాష్ ఆనంద్ చౌపాల్ పథకం ఎన్నికల ప్రచారంలో కొత్త శక్తిని, దిశను అందించగలదని భావిస్తున్నారు. తద్వారా పార్టీ ఇమేజ్ తోపాటు పార్టీ సంస్థాగతంగా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందనుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..