AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. నిద్రపోతున్న భర్త గొంతు కోసి చంపిన భార్య.. ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌పై..!

హర్యానాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సోనిపట్‌ ప్రాంతంలో ఒక భార్య తన భర్తను దారుణంగా హతమార్చింది. మొదట తన భర్త నోటిపై దిండుతో అదిమి పెట్టి, గొంతు కోసి హత్య చేసింది. ఆపై అతను తప్పించుకోకుండా ఉండటానికి అతని ప్రైవేట్ భాగాలను గట్టిగా నొక్కింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దారుణం.. నిద్రపోతున్న భర్త గొంతు కోసి చంపిన భార్య.. ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌పై..!
Sonipat Crime News
Balaraju Goud
|

Updated on: Jan 07, 2026 | 3:17 PM

Share

హర్యానాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సోనిపట్‌ ప్రాంతంలో ఒక భార్య తన భర్తను దారుణంగా హతమార్చింది. మొదట తన భర్త నోటిపై దిండుతో అదిమి పెట్టి, గొంతు కోసి హత్య చేసింది. ఆపై అతను తప్పించుకోకుండా ఉండటానికి అతని ప్రైవేట్ భాగాలను గట్టిగా నొక్కింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సోనిపట్‌లోని కాకాన గ్రామానికి చెందిన రామ్ కిషన్ గత ఏడాది కాలంగా కామి రోడ్‌లోని ఆశిర్వాడ్ గార్డెన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా భార్య సరిత వివాహేతర సంబంధం బయటపడటంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. రామ్ కిషన్ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సోమవారం (జనవరి 05) రాత్రి మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిత సోమవారం రాత్రి రామ్‌కిషన్‌ను డబ్బు అడిగింది. ఇంటి ఖర్చులను చూపుతూ రామ్‌కిషన్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఇద్దరు కలిసి భోజనం చేసి ఒకే గదిలో పడుకున్నారు. ఆ రాత్రి కిషన్‌ను సరిత హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆశ్చర్యకరంగా, హత్య తర్వాత సరిత సాధారణంగానే ప్రవర్తించింది. మంగళవారం ఉదయం, ఆమె నిద్రలేచి, తన పిల్లలకు, అత్తగారికి టీ తయారు చేసి, రామ్‌కిషన్ ఆలస్యంగా నిద్రలేస్తాడని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. ఆమె తన ఇద్దరు పిల్లలను తనతో తీసుకెళ్లి, తన పెద్ద కొడుకును అమ్మమ్మ వద్ద వదిలివేసింది.

కొంత సమయం తరువాత, పెద్ద కుమారుడు కునాల్ తన తండ్రిని నిద్ర లేపడానికి వెళ్ళినప్పుడు, రాంకిషన్ మేల్కొలేదు. తల్లి రుక్మిణీ దేవి గదిలోకి వెళ్లి చూడగా, రాంకిషన్ విగతజీవిగా కనిపించాడు. అతని ముఖం మీద ఒక దిండు ఉంచి, అతని రహస్య భాగాలు వాచి ఉన్నాయి. దీంతో ఇరుగు పొరుగు సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో సరిత ఒక్కరే లేరని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసును రెండు కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాంకిషన్ దగ్గర దాదాపు 5 లక్షల రూపాయలు ఉన్నాయని, కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కామి రోడ్డులోని ఆశిర్వాడ్ గార్డెన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రామ్ కిషన్‌ను అతని భార్య హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఏసీపీ అమిత్ ధంఖర్ తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా, ప్రస్తుతం దర్యాప్తులోని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది..
ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు
Magh Mela 2026: 44 రోజుల పండగ.. మాఘ మేళా, కుంభమేళా మధ్య తేడా ఇదే
Magh Mela 2026: 44 రోజుల పండగ.. మాఘ మేళా, కుంభమేళా మధ్య తేడా ఇదే
బెంగళూర్‌లో దారుణం.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..
బెంగళూర్‌లో దారుణం.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి..
6 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు.. వైభవ్ కన్నా డేంజరస్..
6 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు.. వైభవ్ కన్నా డేంజరస్..
ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. స్కూల్ విద్యార్థులకు పండగే..
ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. స్కూల్ విద్యార్థులకు పండగే..
'నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్ మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా
'నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్ మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా
అమాయకులనుకుంటే పొరపాటే.. యమ డేంజర్.. రికార్డ్స్ చూసి..
అమాయకులనుకుంటే పొరపాటే.. యమ డేంజర్.. రికార్డ్స్ చూసి..