కారులోనే ప్రాణాలొదిలిన వ్యాపారి కుటుంబం.. డోర్ లాక్ చేసుకుని ఏడుగురు..
నివాస ప్రాంతంలో.. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది.. చాలా సేపటి నుంచి అక్కడే ఉంది.. ఉన్నట్టుండి కారులోపల నుంచి అరుపులు.. కేకలు వినిపిస్తున్నాయి.. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. వెంటనే అక్కడికి వచ్చి కారు డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ.. లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు..

నివాస ప్రాంతంలో.. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది.. చాలా సేపటి నుంచి అక్కడే ఉంది.. ఉన్నట్టుండి కారులోపల నుంచి అరుపులు.. కేకలు వినిపిస్తున్నాయి.. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. వెంటనే అక్కడికి వచ్చి కారు డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ.. లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు.. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చెక్ చేశారు.. కారు డోర్లను బ్రేక్ చేసి చూడగా.. అందులో అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు.. ఓ కారులో కుటుంబమంతా ప్రాణాలొదలిన ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని పంచకులలో కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డు పక్కన కారు ఆపి లాక్ చేసి.. దానిలో అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మృతులను డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42) గా గుర్తించారు. వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు, భార్య, వారి ముగ్గురు (ఇద్దరు కుమార్తెలు – ఒక కుమారుడు) పిల్లలు ఉన్నారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్, ఆయన కుటుంబసభ్యులు సోమవారం అర్ధరాత్రి కారులోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయి, పంచకులలో ఓ అద్దింట్లో నివాసం ఉంటోంది. వ్యాపారంలో నష్టాలతో కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్న కుటుంబం చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుల బారిన పడిన కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హనుమాన్ కథా కార్యక్రమానికి వచ్చి..
డెహ్రాడూన్ నివాసి అయిన ప్రవీణ్ మిట్టల్ సోమవారం తన కుటుంబంతో కలిసి బాగేశ్వర్ ధామ్‌లో నిర్వహించిన హనుమాన్ కథా కార్యక్రమానికి హాజరయ్యేందుకు పంచకులకు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, వారు డెహ్రాడూన్‌కు తిరిగి వస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. స్థానికుల ప్రకారం.. కుటుంబం మొత్తం కారు లోపల ఇబ్బంది పడుతుండటాన్ని గమనించి వెంటనే 112కు డయల్ చేశారు.. దీంతో వెంటనే అధికార బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. వారంతా అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్ సీన్ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర అధికారులు కారు తలుపులను బలవంతంగా తెరిచి చూడగా, బాధితులు లోపల నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




