Hanuman Chalisa Row: మహారాష్ట్రలో హీటెక్కిన హానుమాన్‌ చాలీసా రాజకీయం.. సీఎం ఇంటి ముందు చదువుతామన్న బీజేపీ

|

Apr 23, 2022 | 6:46 AM

మహారాష్ట్రలో హానుమాన్‌ చాలీసా రాజకీయం మరింత హీటెక్కింది. ఇది భారతీయ జనతా పార్టీ వర్సెస్‌ శివసేనగా మారింది. దీంతో ముంబైలో హైటెన్షన్‌ నెలకొంది.

Hanuman Chalisa Row: మహారాష్ట్రలో హీటెక్కిన హానుమాన్‌ చాలీసా రాజకీయం.. సీఎం ఇంటి ముందు చదువుతామన్న బీజేపీ
Uddhav Thackeray
Follow us on

Hanuman Chalisa Row: మహారాష్ట్ర(Maharashtra)లో హానుమాన్‌ చాలీసా రాజకీయం మరింత హీటెక్కింది. ఇది భారతీయ జనతా పార్టీ(BJP) వర్సెస్‌ శివసేన(Shivasena)గా మారింది. దీంతో ముంబైలో హైటెన్షన్‌ నెలకొంది. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా బీజేపీ వర్సెస్‌ శివసేన వార్‌ కంటిన్యూ అవుతోంది. దీనికి కారణమైంది హానుమాన్ చాలీసా. దీనిపై తాజాగా కీలక ప్రకటన చేశారు బీజేపీ నేతలు. ముంబైలోని ఠాక్రే నివాసం మాతోశ్రీకి వచ్చి హనుమాన్ చాలీసా చదువుతామని, ధైర్యముంటే తమను అడ్డుకోవాలని ఛాలెంజ్ చేశారు బీజేపీ నేతలు. వారి ప్రకటన నేపథ్యంలో శివసేన నాయకులు కూడా తమను రెచ్చగొట్టొద్దంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కీలక నేతలు ముంబై చేరుకున్నారు. వారు ఇవాళ మాతోశ్రీకి చేరుకుని అక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తారని అనుచరులు చెబుతున్నారు. దీంతో ముంబైలో హైటెన్షన్‌ నెలకొంది. ధైర్యముంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన నివాసం నుంచి బయటకు వచ్చి హనుమాన్ చాలీసా చదవాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ లీడర్లు. వీరికి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే తోడయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు కమలం పార్టీ నేతలు. కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయలేరని, అలాచేస్తే ఆయన కూటమిలోని కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతాయని ఆయనకు భయం అని కామెంట్స్‌ చేస్తున్నారు. అటు బీజేపీ నేతలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తున్నారు శివసేన నేతలు. ఉద్ధవ్ ఠాక్రే పాలనలో అన్ని మతాల ప్రజల ప్రశాంతంగా ఉంటున్నారని, బీజేపీ కావాలనే అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఫైర్‌ అవుతున్నారు.

Read  Also… Vizag Steel Plant: ప్రారంభమైన స్టీల్ ప్లాంట్ ఎన్నికలు… బారులు తీరిన కార్మికులు.. రాత్రికి రిజల్ట్