Robbery Bride: డబ్బుల కోసం యువకులకు పెళ్లి పేరుతో ఎర.. ఏడాది తర్వాత పోలీసులకు పట్టుబడిన నిత్య పెళ్లి కూతురు

|

May 23, 2023 | 1:16 PM

ఈజీగా డబ్బు సంపాదన కోసం ఓ యువతి పెళ్లిని ఎంచుకుంది, దీంతో యువకులకు గేలం వేసి.. పెళ్లి చేసుకుని  డబ్బు దోచుకుని పారిపోయేది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఒక వధువు సూరత్‌కు చెందిన వజ్రాలకు సానపెట్టె యువకుడికి పెళ్లి చేసుకుంది. 

Robbery Bride: డబ్బుల కోసం యువకులకు పెళ్లి పేరుతో ఎర..  ఏడాది తర్వాత పోలీసులకు పట్టుబడిన నిత్య పెళ్లి కూతురు
Robbery Bride
Follow us on

గుజరాత్ లో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ డబ్బులు తీసుకుని యువకులను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్ళికూతుర్ని పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నుంచి ఈ యువతి కోసం వెడుతుకున్నట్లు పోలీసులు చెప్పారు. వడోదరలోని పానిగేట్ పోలీసులు గత ఏడాది కాలం నుంచి పరారీలో ఉన్న దొంగ పెళ్లికూతురు శీతల్ రాథోడ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. సూరత్‌లోని కతర్గాం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈజీగా డబ్బు సంపాదన కోసం ఓ యువతి పెళ్లిని ఎంచుకుంది, దీంతో యువకులకు గేలం వేసి.. పెళ్లి చేసుకుని  డబ్బు దోచుకుని పారిపోయేది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఒక వధువు సూరత్‌కు చెందిన వజ్రాలకు సానపెట్టె యువకుడికి పెళ్లి చేసుకుంది.

పెళ్లయ్యాక నిందితురాలు శీతల్‌ కొంత కాలం అత్తమామలతో గడిపింది. శీతల్ రాథోడ్‌ మధ్యవర్తుల ద్వారా తన భర్త నుంచి రూ.1.30 లక్షలు తీసుకుంది. తరువాత ఇంటి నుంచి పారిపోయింది. తన భార్య కోసం యువకుడు ఫోన్ చేసినా ఎప్పుడూ స్విచ్ ఆఫ్‌ వచ్చేది. దీంతో ఆ యువకుడికి తన భార్యపై అనుమానం వచ్చింది. తాను మోసపోయానని బాధిత యువకుడు తెలుసుకుని వెంటనే వధువుపై కతరగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశాడు. .

ఏడాది నుంచి పోలీసులు దొంగ పెళ్ళాం గురించి వెదుకుతూనే ఉన్నారు. అయితే వడోదరలోని పానిగేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి దొంగ వధువు వడోదరలో ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా వడోదర పోలీసులు దొంగ పెళ్లికూతురును గుర్తించారు. అనంతరం వడోదర పోలీసులు దొంగ పెళ్లికూతురును అదుపులో తీసుకుని సూరత్ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

పెళ్లికూతురు దొంగ శీతల్‌ రాథోడ్‌ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుని డబ్బులు, నగలతో మాయం అవుతుందని.. రకరకాల పేర్లతో యువకులను పెళ్లి చేస్తూ మోసం చేసి డబ్బులు వసూలు చేసేదని పోలీసులు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..