Valentines Day: మూడేళ్లుగా తగ్గని వ్యాధి.. భార్యకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త.. ప్రేమికుల రోజునే..

|

Feb 14, 2021 | 9:00 PM

Valentines Day: ప్రేమ బంధం గొప్పది. పెళ్లి బంధం అంతకు మించిన గొప్పది. అందుకే ప్రేమికులు విడిపోయినా.. పెళ్లి చేసుకున్న..

Valentines Day: మూడేళ్లుగా తగ్గని వ్యాధి.. భార్యకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త.. ప్రేమికుల రోజునే..
Follow us on

Valentines Day: ప్రేమ బంధం గొప్పది. పెళ్లి బంధం అంతకు మించిన గొప్పది. అందుకే ప్రేమికులు విడిపోయినా.. పెళ్లి చేసుకున్న వారు విడిపోయిన దాఖలాలు మాత్రం చాలా అరుదు. భారతీయ సంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటైన జంట తమ తుదిశ్వాస వరకూ కలిసే ఉంటారు. బతికినంతకాలం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడై నిలుస్తారు. ఎంతోమంది జీవితాల్లో ఎలాంటి ఘటనలను మనం చూశాం. అయితే, తాజాగా ఓ వ్యక్తి తన భార్య పడుతున్న వేదనను చూడలేక తన కిడ్నీనే దానం చేయడానికి సిద్ధపడ్డాడు.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వినోద్ పటేల్, రీటా పటేల్ దంపతులు ఉన్నారు. వీరికి పెళ్లై 23 ఏళ్లు అవుతోంది. అయితే, రీటా పటేల్‌కు బెన్ ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి కారణంగా రెండు కిడ్నీలూ పాడైపోయాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె ఈ సమస్యతో బాధపడుతోంది. మందులు వాడుతూ వస్తోంది. అయితే సమస్య తీరకపోగా.. ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతోంది. దాంతో భార్య వేదనను చూడలేకపోయిన భర్త వినోద్.. తన కిడ్నీని తన భార్యకు ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యులను కోరాడు.

అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు.. ఇరువురి రక్త నమూనాలు పరిశీలించి, ఇతర పరీక్షలు చేసి.. వినోద్ కిడ్నీని, రీటాకు ఏర్పాటు చేయొచ్చని నిర్ధారించారు. ఆదివారం నాడు వీరికి ఆపరేషన్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఇవాళ యాదృచ్ఛికంగా ప్రేమికుల రోజు కావడం.. భార్య కోసం ఓ భర్త తన కిడ్నీని ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ ఆపరేషన్‌పై స్పందించిన వైద్యులు.. ‘కిడ్నీ సంబంధిత వ్యాధితో రీటా గత మూడు సంవత్సరాలుగా బాధ పడుతోంది. అలా తన భార్య వేదనను చూడలేక వినోద్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏదైమైనా వారి పెళ్లి రోజే ప్రేమికుల రోజు కావడం, ఈ రోజే తాము ఈ ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.’ అని ఆస్పత్రి వైద్యులు చెప్పుకొచ్చారు.

Also read:

Nellore Politics: అందుకు ఎన్నికలే అవసరం లేదు.. నెల్లూరు నగరంపై సంచలన ప్రకటనలు చేసిన మాజీ మంత్రి ఆనం..

Love Story: ‘నిన్ను నాలో దాచి.. నన్ను నీలో విడిచి.. వెళ్లిపొమ్మంటోంది ప్రేమ’.. మనసును తాకుతోన్న ‘లవ్ స్టోరీ‘ సాంగ్..