AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు

తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు గుజరాత్‌లోని మలయాళీ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడు దినేష్ నాయర్ శబరిమల అభివృద్ధి కోసం కీలక ప్రతిపాదనలు చేశారు. ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ సుస్థిర అభివృద్ధి అవసరాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు
Gujarat Malayalee Leaders
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2025 | 5:54 PM

Share

శబరిమలలో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మార్చేందుకు గుజరాత్‌లోని మలయాళీ సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడు దినేష్ నాయర్ సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు చేశారు. లోక కేరళ సభ ప్రత్యేక ఆహ్వానితుడిగా, ప్రపంచ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నాయర్.. శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ సుస్థిర అభివృద్ధి చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు.

శబరిమల అభివృద్ధికి ఆరు కీలక రంగాల్లో ప్రతిపాదనలు:

1. రవాణా సదుపాయాల మెరుగుదల

కేఎస్ఆర్టీసీ (KSRTC) ప్రత్యేక సేవలు

అంతర్రాష్ట్ర బస్సు సేవల విస్తరణ

భక్తుల సౌకర్యార్థం రోప్‌వే వ్యవస్థ ఏర్పాటు

2. భక్తుల సౌకర్యాలు & మౌలిక సదుపాయాలు

పర్యావరణానికి హాని లేకుండా ఆశ్రయాలు, డార్మిటరీలు, విశ్రాంతి గృహాల ఏర్పాటు

పరిశుభ్రమైన మరుగుదొడ్లు, స్నానాల గదులు, త్రాగునీటి సదుపాయాలు

దర్శన టోకెన్ల కోసం డిజిటల్ బుకింగ్ సిస్టమ్

వృద్ధులు, వికలాంగ భక్తులకు ప్రత్యేక సహాయక సేవలు

3. ఆరోగ్యం & భద్రత

శాశ్వత మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్ ఏర్పాటు

అత్యవసర విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు

రక్తదానం, ఫస్ట్ ఎయిడ్ కోసం వాలంటీర్ నెట్‌వర్క్

4. పర్యావరణ పరిరక్షణ & సుస్థిరత

కఠినమైన ప్లాస్టిక్ నిషేధం, ఘన వ్యర్థాల నిర్వహణ

గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడం

అటవీ విస్తరణ, నది తీరాల సంరక్షణ

5. సాంస్కృతిక & ఆధ్యాత్మిక ప్రచారం

శబరిమల భక్తుల సమాచారం కేంద్రం

అంతర్జాతీయ అయప్ప పరిశోధన & సాంస్కృతిక సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహణ

ప్రపంచవ్యాప్తంగా భక్తులను కలిపే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు

6. పరిపాలన & గ్లోబల్ ఎంగేజ్‌మెంట్

గ్లోబల్ అయప్ప ఫెలోషిప్ కార్యక్రమం

విదేశాల్లోని మలయాళీ సంఘాల భాగస్వామ్యం

నిధుల వినియోగం, అభివృద్ధి ప్రాజెక్టుల్లో పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం

శబరిమల అభివృద్ధి కోసం చేసిన ఈ ప్రతిపాదనలు భక్తుల యాత్రను సౌకర్యవంతం చేయడంతో పాటు ఆలయ పవిత్రతను కాపాడాలని దినేష్ నాయర్ స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను కేరళ ప్రభుత్వం, దేవస్వం బోర్డు పరిగణనలోకి తీసుకుని, శబరిమల యాత్రను మరింత సుస్థిరంగా, భక్తులకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Dinesh Nair Gujarat Malayal

Dinesh Nair (Left)