Viral Video: వచ్చిందమ్మ వయ్యారి.. ఏమీ ఎర్గనట్లు ఎట్లా బజ్జుందో సూడుర్రి… వానాకాలం బయట కారు పార్క్ చేసేటోళ్లు జర జాగ్రత్త!
వర్షాకాలం వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తుంది. అప్పటి వరకు దాక్కున్న పాములు, తేళ్లన్ని వర్షాలు పడటంతో మెల్లగా బయటకు వస్తుంటాయి. వరద నీటితో పాటు పాములు ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి. ఇక ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. ఈ క్రమంలో పాములు కాటేయడంతో పలువురు మృతి చెందిన...

వర్షాకాలం వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తుంది. అప్పటి వరకు దాక్కున్న పాములు, తేళ్లన్ని వర్షాలు పడటంతో మెల్లగా బయటకు వస్తుంటాయి. వరద నీటితో పాటు పాములు ఇళ్లల్లోకి చొరబడుతుంటాయి. ఇక ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. ఈ క్రమంలో పాములు కాటేయడంతో పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కారు బానెట్ కింద కొండ చిలువ బజ్జున్న వీడియో హల్‌చల్ చేస్తోంది.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. బరబంకీలోని సత్నమ్ పుర్వాలో ఓ వ్యక్తి కారు ఇంజన్‌లో కొండ చిలువ దాక్కుంది. డ్రైవర్ కారు నడుపుతున్న సమయంలో బానెట్ కింద ఏదో అలజడి మొదలైందట. దీంతో కారు ఆపి బానెట్ ఓపెన్ చేయడంతో అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంజన్ మీద ఓ భారీ కొండ చిలువ ముడుచుని ఉంది. కొండ చిలువ చూడగానే షాక్‌తో దూరంగా ఊరికారు.
కారు వద్దకు చేరుకున్న స్థానికులు వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొండ చిలువను జాగ్రత్తగా బంధించి తీసుకెళ్లారు. వైరల్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతుతున్నారు.
వీడియో చూడండి:
यूपी के बाराबंकी में भाजपा नेता नागेंद्र प्रताप सिंह की कार के इंजन में 7 फीट लंबा अजगर छिपा मिला।
वन विभाग ने सुरक्षित रेस्क्यू किया। #UttarPradesh #Barabanki pic.twitter.com/Vz9l6SNCrQ
— Vinay Saxena (@vinaysaxenaj) September 22, 2025
