Gujarat: సింహం సింగిల్‌గానే వచ్చింది.. అదికూడా హోటల్‌కి.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..

Lion enter in hotel: సింహం ఎప్పుడూ సింగిల్‌ గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయ్‌.. అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ అందరికీ..

Gujarat: సింహం సింగిల్‌గానే వచ్చింది.. అదికూడా హోటల్‌కి.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..

Updated on: Feb 11, 2021 | 12:13 PM

Lion enter in hotel: సింహం ఎప్పుడూ సింగిల్‌ గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయ్‌.. అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే ఉంటుంది. తాజాగా ఓ సింహం కూడా డైలాగ్‌‌కు తగ్గట్టు దర్జాగా హోటల్‌కు వచ్చి వెళ్లింది. ఈ ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. జూనాఘడ్‌లోని రైల్యేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న సరోవర్ పోర్టికో హోటల్‌ ప్రాంగణంలోకి సింహం గోడ దూకి వచ్చింది. అయితే.. సింహం బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హోటల్‌లోకి ప్రవేశించి.. మళ్లీ వెంటనే వెళ్లిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సింహం తెల్లవారుజామున రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సింహం వచ్చివెళ్లిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీనికి డిఫెరెంట్ డిఫెరెంట్‌గా కామెంట్లు చేస్తున్నారు. రాత్రి హోటల్లో చెక్‌ ఇన్‌ అయింది కాబట్టి.. సింహం ఉదయాన్నే మళ్లీ తిరిగి అడవిలోకి వెళ్తుంది.. అంటూ సరదా కామెంట్స్‌తో పాటు బయపడే కామెంట్స్ చేస్తున్నారు.

కాగా జునాఘడ్‌ సింహల అభయారణ్యమైన గిర్‌ కొండలకు సరిహద్దుల్లో ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇలా సింహాలు రాత్రి సమయంలో జూనాఘడ్‌ రోడ్లపై తరచూ తిరుగుతుంటాయి. తాజాగా హోటల్‌కు సింహం వచ్చి వెళ్లడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read:

Manasa Varanasi: మానస వారణాసి అసలు ఏం చదువుకుంది.. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఎంటంటే ?

Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..