గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులన్నీ బ్రేక్ చేసింది. దాదాపు 157 సీట్లలో పూర్తి ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఆప్.. బీజేపీ ప్రభంజనం ముందు చతికలపడ్డాయి. కాగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రివాబా.. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు. తనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు.. తన కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తన విజయం మాత్రమే కాదు.. ప్రజలందరి విజయం అంటూ రివాబా సంతోషం వ్యక్తం చేశారు.
నార్త్ జామ్‌నగర్ నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో ఆమెకు 55% పైగా ఓట్లు వచ్చాయి. ఆమె తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అహిర్ కరాషన్‌భాయ్ పర్బత్‌భాయ్ కర్మూర్ (23.37%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసిఘ్ చతుర్‌సిన్హ్ జడేజా (15.49%) ఉన్నారు.
Those who accepted me happily as a candidate, worked for me, reached out & connected to people – I thank them all. It’s not just my victory but of all of us: BJP’s Jamnagar North candidate, Rivaba Jadeja
As per EC’s official trend, she is leading with a margin of 31,333 votes. pic.twitter.com/UglAYQ6kyq
— ANI (@ANI) December 8, 2022
కాగా.. రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా సైతం ప్రచారం చేశారు. అయితే, జడేజా సొంత చెల్లి నైనా జడేజా కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వదినపై తీవ్ర విమర్శలు సైతం చేశారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకుగాను ఇప్పటి వరకు 157 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..