Gujarat Civic Polls Results: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ.. 201 స్థానాల్లో ఆధిక్యం..

|

Feb 23, 2021 | 12:50 PM

Gujarat Municipal Corporation Election Results Updates: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పోరేషన్లల్లో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఈ ఆరు నగరాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది...

Gujarat Civic Polls Results: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ.. 201 స్థానాల్లో ఆధిక్యం..
Follow us on

Gujarat Municipal Corporation Election Results Updates: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పోరేషన్లల్లో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఈ ఆరు నగరాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. ఆరు కార్పొరేషన్లల్లో ఉన్న 575 సీట్లల్లో 2,276 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ నగరాల్లో బీజేపీనే మొదటిస్థానంలో ఉంది. ఆరంటిలో ఉన్న 575 సీట్లకు గాను 201 సీట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. 41 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

కార్పొరేషన్ల వారీగా.. లీడ్‌లో ఉన్న పార్టీల వివరాలు..
అహ్మదాబాద్- బీజేపీ 65, కాంగ్రెస్ 10, ఎఐఎంఐఎం 4 స్థానాలు..
వడోదర – బిజెపి 15, కాంగ్రెస్ 10 స్థానాలు..
రాజ్‌కోట్ – బిజెపి 28 సీట్లల్లో ముందంజ..
సూరత్- బిజెపి 46, కాంగ్రెస్ 10, ఆప్ 18 స్థానాలు..
భావ్‌నగర్- బిజెపి 20, కాంగ్రెస్ 9..
జామ్‌నగర్ – బిజెపి 16, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కాగా.. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంది.  సూరత్‌లో మొట్టమొదటి సారిగా ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆధిపత్యాన్ని కనబరుస్తుండటం విశేషం.

Also Read:

ఉత్తరాఖండ్ విషాదం, ఇంకా ఆచూకీ తెలియని 136 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు

సంచలన నిర్ణయం తీసుకున్న రిలయన్స్… 100 శాతం నిర్వహణతో ఓటూసీ అనుబంధ సంస్థ..!