Vijay Rupani Corona Positive: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్.. నిర్ధారించిన డాక్టర్లు

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి(64) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆదివారం వడోదరలోని నిజాంపుర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం

Vijay Rupani Corona Positive: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్.. నిర్ధారించిన డాక్టర్లు

Updated on: Feb 15, 2021 | 1:28 PM

Vijay Rupani Corona Positive:  గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి(64) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆదివారం వడోదరలోని నిజాంపుర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తూనే సీఎం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆస్ప్రతికి తరలించారు. తాజాగా టెస్టుల్లో సీఎంకు కరోనా సోకినట్లు తేలింది. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యాన్ని ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆదివారం సభా వేదికపై పడిపోవడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. కాగా, విజయ్ రూపానికి లో-బీపీ గురవ్వడం వల్లే కళ్లు తిరిగి పడిపోయారని ఆదివారం బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కాగా, విజయ్ రూపానికి శనివారం నుంచి కొంత అస్వస్థతగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించారు. తాజా పరీక్షల్లో ఆయన కరోనా బారిన పడినట్లు తేలింది.

Also Read:

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. ఆ కూలీ ఖాతాలో అక్షరాలా కోటి రూపాయలు

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్