AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Temple Conspiracy: అయోధ్య రామమందిరంపై దాడికి పాక్‌ ISI కుట్ర.. ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్‌ అరెస్ట్‌..

అయోధ్య రామమందిరం దాడికి స్కెచ్‌ గీశారు ఉగ్రవాదులు. రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ పన్నిన కుట్రను గుజరాత్‌ ఏటీఎస్‌,హర్యానా ఏటీఎస్‌ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేశారు. రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Ayodhya Ram Temple Conspiracy: అయోధ్య రామమందిరంపై దాడికి పాక్‌ ISI కుట్ర.. ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్‌ అరెస్ట్‌..
Ayodhya Ram Temple
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2025 | 9:34 PM

Share

అయోధ్య రామమందిరంపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. హర్యానా లోని ఫరీదాబాద్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌,హర్యానా ఏటీఎస్‌ జాయింట్‌ ఆపరేషన్‌లో అబ్దుల్‌ రెహ్మాన్‌ అనే ఉగ్రవాదిని అదుపు లోకి తీసుకున్నారు. 20 ఏళ్ల అబ్దుల్‌ రెహ్మాన్‌ పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్టు గుర్తించారు.

అబ్దుల్‌ రెహ్మాన్‌ దగ్గరి నుంచి రెండు హ్యాండ్‌ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే నిర్వీర్యం చేశారు. అయోధ్య రామమందిరంపై దాడి చేయడానికి రెహ్మాన్‌ను ఐఎస్‌ఐ ఉసిగొల్పినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయోధ్య రామమందిరంపై అబ్దుల్‌ రెహ్మాన్‌ పలుమార్లు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. రామమందిరం సెక్యూరిటీ వివరాలను ఐఎస్‌ఐకి చెరవేసినట్టు కూడా గుర్తించారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తొలుత గుజరాత్‌ ఏటీఎస్‌ అప్రమత్తమయ్యింది. హర్యానా ఏటీఎస్‌ సహకారంతో ఈ కుట్రను గుట్టురట్టు చేశారు.

అబ్దుల్‌ రెహ్మాన్‌ను యూపీ లోని ఫైజాబాద్‌ నివాసిగా గుర్తించారు. ఫరీదాబాద్‌లో మారుపేరుతో అతడు నివసిస్తునట్టు దర్యాప్తులో తేలింది. అబ్దుల్‌ రెహ్మాన్‌ నెట్‌వర్క్‌ను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తరువాత అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అబ్దుల్‌ రెహ్మాన్‌ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని  వెల్లడించాడు. జమాత్‌ కార్యక్రమాల కోసం ఢిల్లీ, విశాఖ వెళ్లి కొద్దిరోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిపాడు. కాగా.. అబ్దుల్‌ రెహ్మాన్‌ జమాత్‌ కార్యక్రమాలను విధిగా హాజరైనట్టు కూడా గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు