AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీ.. ఈ శతాబ్దపు అతిపెద్ద ఉన్మాద చర్య.. సుబ్రహ్మణ్య స్వామి నిప్పులు

జీఎస్టీని ఈ శతాబ్దపు అతిపెద్ద ఉన్మాద చర్యగా అభివర్ణించారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. జీఎస్టీ ఫారాలలో ఎక్కడ, ఏ అంశాన్ని  రాసి దాన్ని భర్తీ చేయాలో ఎవరికీ అర్థం కాదన్నారు.

జీఎస్టీ.. ఈ శతాబ్దపు అతిపెద్ద ఉన్మాద చర్య.. సుబ్రహ్మణ్య స్వామి నిప్పులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 20, 2020 | 2:03 PM

Share

జీఎస్టీని ఈ శతాబ్దపు అతిపెద్ద ఉన్మాద చర్యగా అభివర్ణించారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. జీఎస్టీ ఫారాలలో ఎక్కడ, ఏ అంశాన్ని  రాసి దాన్ని భర్తీ చేయాలో ఎవరికీ అర్థం కాదన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యాన  హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 2030 సంవత్సరానికల్లా ఇండియా సూపర్ పవర్ గా ఎదగాలంటే 10శాతం ఆర్థికవృద్దిని సాధించవలసి ఉందన్నారు. ఇందుకోసం ఇన్ కమ్ టాక్స్ రద్దు వంటి మౌలిక సంస్కరణలు అవసరమన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిన కారణంగా ఇండియా పెద్ద సమస్యను ఎదుర్కొంటోందని, ఖర్చు చేయడానికి వారివద్ద సొమ్ము లేనికారణంగా డిమాండ్ కూడా తగ్గిందని ఆయన చెప్పారు. ఇది ఆర్ధిక వ్యవస్థకు అవరోధంగా మారిందన్నారు.

ఆదాయం పన్ను రద్దు వంటి చర్యల కారణంగా సేవింగ్స్ ఆదా అవుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. ఆదాయం పన్ను, జీఎస్టీ వంటి వాటి విషయంలో ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదని చెప్పిన ఆయన.. వీటిని బూచిగా చూపి ప్రభుత్వం వారిని భయపెట్టరాదని సూచించారు.

‘ప్రధాని మోదీ నాలాగా ఆలోచించడం లేదు. పైగా నా మాదిరి ఆలోచించాలని నచ్చజెప్పలేకపోతున్నాను. అయితే అన్ని విధానాలు విఫలమయ్యాక.. ఆయన కూడా నాలాగే ఆలోచిస్తారు’ అని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆర్ధిక సంస్కరణలకు నాంది పలికిన దివంగత మాజీ ప్రధాని పీవీ. నరసింహారావుకు ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని స్వామి పేర్కొన్నారు.