కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..

మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లంటే అటు అమ్మాయి తరపువాళ్లు.. ఇటు అబ్బాయి తరపువాళ్లు ఎంతో సంబంరంగా నిర్వహించే వేడుక..

కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..
Bride

Updated on: Jun 18, 2021 | 6:25 PM

మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లంటే అటు అమ్మాయి తరపువాళ్లు.. ఇటు అబ్బాయి తరపువాళ్లు ఎంతో సంబంరంగా నిర్వహించే వేడుక.. రెండు కుటుంబాల కలయిక. మ ఇంటి ఆడబిడ్డను అత్తారింటికి పంపే వేడుకను తమకు తోచినంతలో ఘనంగా జరిపించాలని ఆరాటపడతారు ప్రతీ తల్లిదండ్రులు. వివాహం జరుగుతున్న ప్రదేశంలో అంత సంతోషంగా.. భావోద్వేగాలతో కలిసిన వాతావరణం కనిపిస్తుంటుంది. అలాంటి పెళ్లిలో వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులకు.. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంకాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా.. ఓ యువతి కళ్యాణ మండపంలోకి ప్రవేశించింది. వరుడికి ఇదివరకే రహస్యంగ పెళ్లైందని తెలిసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.  దీంతో ఆ వధువు ఆ వరుడి తమ్ముడినే పెళ్లి చేసుకుని అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది.

వివరాల్ళోకెళితే.. పాట్లాలోని పాలీగంజ్ ప్రాంతంలోని అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈనెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరి కొద్దిసేపట్లో తాళి కడతాడనగా.. అనిల్ భార్య పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. అక్కడివారందరి ముందు అనిల్ నిజాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసిన పెద్దలు ఆ తర్వాత రోజే వరుడి తమ్ముడితో వధువుకు తాళి కట్టించారు.

Also Read: Actress Revathi Sampath: దర్శకనిర్మాతలపై నటి రేవతి షాకింగ్ కామెంట్స్.. మొత్తం 14 మంది పేర్లను బయటపెట్టిన నటి..

Telangana PCC Chief: కొలిక్కి వచ్చిన తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు.. సీల్డ్‌ కవర్‌లో ఒకరి పేరు.. ఏ క్షణానైనా ప్రకటించే ఛాన్స్!

KTR : గృహ ప్రవేశాల ముహూర్తాలు ఖరారు : ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అంబరాన్నంటనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవ సంబరాలు

Mystery of Plane Crash: ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం అదృశ్యమైన విమాన రహస్యం.. కరువు దెబ్బకు బయట పడింది!