జమ్మూ క‌శ్మీర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. ముగ్గురు జ‌వాన్ల‌కు గాయాలు.. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు

|

Dec 24, 2020 | 10:21 AM

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గాందర్బల్ ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సిబ్బంది లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా అధికారులు...

జమ్మూ క‌శ్మీర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. ముగ్గురు జ‌వాన్ల‌కు గాయాలు.. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు
Follow us on

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గాందర్బల్ ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సిబ్బంది లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గాంద‌ర్బ‌ల్‌లోని దుద‌ర్‌హామా చౌక్‌లోని సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) బంక‌ర్‌పై ఈ దాడి జ‌రిగింది. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ మ‌ధ్య కాలంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలే ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు.

కాగా, జ‌మ్మూ ప్రాంతంలో ప్ర‌తి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డుతుండ‌టంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఉగ్ర‌మూక‌ల‌కు భార‌త ఆర్మీ ఎన్నో సార్లు బుద్ది చెప్పినా వారి తీరులో ఏ మాత్రం మార్పు రావ‌డం లేదు. జ‌మ్మూ ప్రాంతంలో ప్ర‌తి రోజు ఉగ్ర కాల్పులు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌త్యేక భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడ్డ ట్రావెల్స్ బ‌స్సు.. 35 మందికి గాయాలు