మనోళ్ల వీరోచిత పోరాటానికి సమాధులే సాక్ష్యం !

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:16 PM

భారత జాతి మరిచిపోలేని చేదు జ్ఞాపకం. చైనా కుతంత్రాలకు 20మంది సైనికులు అమరులైన క్షణం. ఆసేతు హిమాచలాన్ని కన్నీరు పెట్టించిన దుర్దినం. మనోళ్లు 20మంది చనిపోయారని మన దేశం ప్రపంచానికి చెప్పింది. కానీ గాల్వన్‌ ఘటన జరిగిన 76 రోజుల తర్వాత చైనా చెప్పని సమాధుల నిజాలు బయటపడుతున్నాయి.

మనోళ్ల వీరోచిత పోరాటానికి సమాధులే సాక్ష్యం !
Follow us on

భారత జాతి మరిచిపోలేని చేదు జ్ఞాపకం. చైనా కుతంత్రాలకు 20మంది సైనికులు అమరులైన క్షణం. ఆసేతు హిమాచలాన్ని కన్నీరు పెట్టించిన దుర్దినం. మనోళ్లు 20మంది చనిపోయారని మన దేశం ప్రపంచానికి చెప్పింది. కుట్రలు పన్ని దొంగ దెబ్బ తీసిన చైనా మాత్రం తమ సైనికుల మృతుల వివరాలను దాచి పెట్టింది. కానీ మనోళ్ల ధైర్యానికి ఇప్పుడిప్పుడే చైనా నుంచి సమాధానం వస్తోంది. వారి సమాధుల్లో దాచిన వాస్తవం బయటపడుతోంది. మన లెక్క 20…మరి చైనా లెక్కంతో తెలుసా…ఇప్పుడు మీకు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా చైనా చెప్పని నిజాన్ని చూపించబోతుంది..మనోళ్ల వీరోచిత పోరాటానికి సాక్ష్యమిదో అని చెప్పబోతుంది.

జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులు 96 మంది చనిపోయారు. గాల్వన్ లోయలో ఆ 96 మంది సైనికుల సమాధులు ఇప్పుడు బయటపడ్డాయి. వీరంతా భారత సరిహద్దులో జరిగిన ఘర్షణలో చనిపోయినట్లు ఇక్కడున్న సమాధులపై పెట్టిన బోర్డుల్లో కనిపిస్తుంది.

మొత్తం 35మంది అధికారులతో పాటు సైనికులు చనిపోయినట్లు చైనా పత్రికలో రాశాయి. అయినా ఇప్పటికీ అధికారికంగా డ్రాగన్ కంట్రీ ప్రకటించలేదు. ఇంకా బొంకింది కానీ ఇదీ పరిస్థితి అని ఏ సందర్భంలోనూ చెప్పలేదు. అయినా నిజం దాగితే దాగదు. ఇప్పుడే చైనా కుతంత్రాలు బయటికొస్తున్నాయి. మనోళ్ల వీరోచిత పోరాటానికి ఆ సమాధులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మొత్తం 20మందిని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదంటూ సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. అయినా చైనా తీరులో మార్పు రావడం లేదు. గాల్వన్‌ ఘటన జరిగిన 76 రోజుల తర్వాత చైనా మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తోంది. ఈనెల 29, 30వ తేదీ మధ్య అర్థరాత్రి తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతంలో వాస్తవాదీన రేఖను మార్చేందుకు చైనా సైన్యం యత్నించింది. పాంగాంగ్‌ సో సరస్సు దగ్గర చైనా సైన్యం చొరబాటుకు యత్నించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రాగన్‌ దుశ్చర్యను పసిగట్టిన భారత జవాన్లను వారి చొరబాటును తిప్పికొట్టినట్టు తెలుస్తోంది.

ఆర్మీ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు రెండు దేశాల విదేశీ ప్రతినిధులు చర్చలు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఈసారి గుణపాఠం చెబుతామని ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నారు.