Farm Laws: రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు: కేంద్రమంత్రి తోమర్

|

Jun 09, 2021 | 11:26 AM

Narendra Singh Tomar: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరున్నర నెలల

Farm Laws: రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు: కేంద్రమంత్రి తోమర్
Narendra Singh Tomar
Follow us on

Narendra Singh Tomar: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరున్నర నెలల నుంచి రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం రద్దు కుదరదని.. సవరణలు మాత్రం చేస్తామంటూ పేర్కొంటోంది. ఈ క్రమంలో చర్చలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మళ్లీ స్పందించారు. అయితే షరతులు మాత్రం వర్తిస్తాయని స్పష్టంచేశారు.

ఈ మేరకు నరేంద్ర సింగ్ తోమర్ మంగళవరం ఎంపీలోని గ్వాలియర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు మాత్రమే సిద్ధమంటూ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం.. రైతులందరితో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటి వార్తలను కేంద్రమంత్రి తోసిపుచ్చారు. నాయకత్వంలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. పూర్తిస్థాయిలో శివరాజ్ సింగ్ కొనసాగుతారని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఇదిలాఉంటే.. బీకేయూ నేత రాకేశ్ తికాయత్ ఈ రోజు కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. దీంతోపాటు ఆయన పలువురు రైతులతో మాట్లాడనున్నారు.

Also Read:

యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి

Telangana Rains: రాష్ట్రాన్ని ముందే పలకరించిన రుతుపవనాలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వరంగల్ లోతట్టు ప్రాంతాలు జలమయం