కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తూ ప్రకటన జారీ.. షరతు విధింపు
ఉల్లి ఎగుమతిపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. 2021 జనవరి.....

ఉల్లి ఎగుమతిపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. 2021 జనవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఉల్లి ధరలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా విదేశాలకు ఉల్లి విత్తనాల ఎగుమతిని తక్షణమే నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) అక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసింది.
కాగా, హోల్ సెల్ దారుల వద్ద 25 టన్నులు, రిటైర్ దారుల వద్ద 2 టన్నులకు మించి ఉల్లి నిల్వలు ఉండరాదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బెంగళూరు రోజ్ ఉల్లి, కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 9నే అనుమతి ఇచ్చింది. ఒక్కో రకం 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే చెన్నై పోర్టు ద్వారా మాత్రమే వీటిని ఎగుమతి చేసుకోవాలని ప్రభుత్వం షరతు విధించింది.
Government of India allows export of all varieties of onions with effect from 1st January 2021 pic.twitter.com/8yMPwVnui5
— ANI (@ANI) December 28, 2020
కరోనా కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతులు.. రవాణా చార్జీలు కూడా రాక రైతుల విలవిల