Gold Smuggling: విమానాశ్రయం టాయిలెట్‌లో బంగారం.. స్మగ్లింగ్‌లో ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర..

చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలోని టాయిలె‌ట్‌లో పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించిన అధికారులు దానిని

Gold Smuggling: విమానాశ్రయం టాయిలెట్‌లో బంగారం.. స్మగ్లింగ్‌లో ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర..
Follow us

|

Updated on: Dec 28, 2020 | 8:48 PM

Gold Smuggling: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలోని టాయిలె‌ట్‌లో పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించిన అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే టాయ్‌లెట్‌లోకి బంగారం రావడంలో విమానాశ్రయంలోని ప్రైవేటు ఉద్యోగుల పాత్ర ఉందని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. దుబాయ్ నుండి వస్తున్న ప్రయాణికుల దగ్గర నుంచి బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి మాఫియాకు అందజేయడంలో ప్రైవేటు ఉద్యోగులు కీలకంగా మారినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం 4.77 కేజీలు ఉండగా, దాని విలువ సుమారు రూ.2.47 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఓ ప్రైవేటు ఉద్యోగి సహా ముగ్గురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Farmers protest: చర్చలకు రాం.. మరోసారి రైతు సంఘాలు చర్చలకు రావాలన్న కేంద్రం ఆహ్వానంపై మండిపాటు

కోవిడ్ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసింది అందుకేనా ? టిబెట్ లో చైనా జోక్యానికి చెక్ పెట్టేందుకేనా ?