షాకింగ్‌.. దేశ వ్యాప్తంగా 94 పాఠశాలల మూసివేత..! కారణాలు ఇలా ఉన్నాయి..

|

Oct 01, 2021 | 6:27 PM

Indian Railway: భారతీయ రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా పలు పాఠశాలలను నిర్మించింది. అయితే చాలా మంది ఉద్యోగుల పిల్లలు అందులో చదువుకోవడం లేదు. ప్రైవేట్

షాకింగ్‌.. దేశ వ్యాప్తంగా 94 పాఠశాలల మూసివేత..! కారణాలు ఇలా ఉన్నాయి..
School Image
Follow us on

Indian Railway: భారతీయ రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా పలు పాఠశాలలను నిర్మించింది. అయితే చాలా మంది ఉద్యోగుల పిల్లలు అందులో చదువుకోవడం లేదు. ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్నారు. దీంతో ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. వాటిని మూసివేసి అదే స్థానంలో PPP (Public Private Partnership) స్కూళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నివేదికను క్యాబినెట్ రైల్వే బోర్డ్ చైర్మన్‌కి పంపింది. సంజీవ్ సన్యాల్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే పాఠశాలలను హేతుబద్ధీకరించడానికి ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రకారం.. ప్రధానంగా రైల్వే స్కూళ్ల పరిస్థితి ఏమిటో అంచనా వేయడం, ఈ పాఠశాలల్లో ఎంత మంది రైల్వే పిల్లలు, ఎంత మంది బయటి పిల్లలు చదువుతున్నారో తెలుసుకోవడం, వీటిని PPP మోడల్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందో ఆలోచించడం. వీటన్నిటిని గమనించి తగిన విధంగా నివేదిక అందజేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ను కోరారు.

రైల్వే పాఠశాలల ప్రస్తుత పరిస్థితి
సంజీవ్ సన్యాల్ అందించిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 94 రైల్వే పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల పిల్లలతో పాటు బయటి వ్యక్తుల పిల్లలు కూడా చదువుతున్నారు. 2019 సంవత్సరంలో 15,399 మంది రైల్వే ఉద్యోగుల పిల్లలు, బయట నుంచి 34,277 మంది పిల్లలు ఈ స్కూళ్లలో చేరారు. 87 కేంద్రీయ విద్యాలయాలకు రైల్వే మద్దతు అందిస్తుంది. ఇందులో 33,212 మంది రైల్వే ఉద్యోగుల పిల్లలు, బయటి నుంచి 55,386 మంది పిల్లలు చదువుతున్నారు. 4 నుంచి18 సంవత్సరాల వయస్సు గల రైల్వే ఉద్యోగుల పిల్లలు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. అయితే ఈ పిల్లల్లో కేవలం 2% మంది మాత్రమే రైల్వే పాఠశాలల్లో చదువుతున్నారు.

రైల్వే పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలనే సూచనలు జారీ చేశారు. ఇందులో మొదటగా రైల్వే పాఠశాలల సంఖ్యను తగ్గించాలి. అవసరమైన చోట రైల్వే పాఠశాలలను కేంద్రీయ విద్యాలయ సంస్థ కిందకు తీసుకురావాలి. రైల్వే పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు నడపడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఉద్యోగుల పిల్లలకు కోటా తప్పనిసరి. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో రైల్వే స్కూల్స్‌ని నడపాలని సిఫార్సు చేశారు. అయితే ఈ పద్దతిని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది.

IPL 2021: హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా.. ముంబై కోచ్ ఏమన్నాడంటే..?

Viral News: చేపకి గంటపాటు ఆపరేషన్‌ చేసిన వైద్యులు..! ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..

Elaichi Water Benefits: యాలకుల నీటితో బోలెడు ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు