RTO Office: వాహనదారులు ఇకపై ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు… 18 సేవలు ఆన్‌లైన్‌లోనే..

|

Mar 06, 2021 | 9:33 AM

RTO Office: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రజలకు అందించే సేవల్లో సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా..

RTO Office: వాహనదారులు ఇకపై ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు... 18 సేవలు ఆన్‌లైన్‌లోనే..
Follow us on

RTO Office: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రజలకు అందించే సేవల్లో సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రవాణా శాఖ కూడా తమ సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. లెర్నర్స్‌ లైసెన్స్‌, వాహన యాజమాన్య హక్కుల మార్పు, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌తో పాటు 18 రకాల సేవలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందించనుంది.
ఈ విషయమై తాజాగా కేంద్ర రవాణా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ ఆన్‌లైన్‌ సేవలు మార్చి 3 నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇకపై వాహనదారులు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలను పొందొచ్చన్నమాట. అయితే ఈ సేవలను ఆన్‌లైన్‌లో పొందాలంటే కచ్చితంగా ఆధార్‌ అథెంటికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ పేర్కొంది.

ఆన్‌లైన్‌లో లభించనున్న సేవలు ఇవే..

* లెర్నర్స్‌ లైసెన్స్‌
* డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌
* డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌
* డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రంలో చిరునామా మార్పు
* అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌
* వాహన యాజమాన్య హక్కుల బదిలీకి ఎన్‌వోసీ, బదిలీ దరఖాస్తు.
* ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌.
* లైసెన్స్‌ నుంచి వాహనాలను తొలగించడం.
* తాత్కలిక రిజిస్ట్రేషన్‌ అప్లికేషన్‌.
* రిజిస్ట్రేషన్‌ డూప్లికేట్‌ సర్టిఫికేట్‌.
* NOC సర్టిఫికేట్‌.
* వాహన యజమాని పేరు మార్పిడి.
* రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌లో చిరునామా మార్పిడి.
* హైర్‌-పర్చెస్‌ అగ్రిమెంట్‌.
* హైర్‌-పర్చెస్‌ అగ్రిమెంట్‌ తొలగింపు. వీటితో పాటు మరికొన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

Also Read: Bride Died In Marriage: అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికూతురు.. అంతలోనే అనంతలోకాలకు.. అసలేం జరిగిందంటే..

CERAWeek event: వాతావరణ మార్పులతో అలాగైతేనే పోరాడగలం.. ‘సెరా వీక్’ సదస్సులో ప్రధాని మోదీ

Tamil Nadu Assembly Election 2021: బీజేపీ – ఏఐఏడీఎంకే మధ్య కుదిరిన ఏకాభిప్రాయం.. బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేయనుందంటే..?