Bipin Rawat Last Rites: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీసీ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. పూర్తి సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా మొత్తం 800 మంది సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అమర వీరుడికి 17 తుపాకులతో తుది వందనాన్ని ప్రభుత్వం సమర్పించింది. అసలు తుపాకులతో వందనం సమర్పించడం ఏమిటి? ఈ విధానం ఎందుకు పాటిస్తారు? ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రశ్నలు అంత్యక్రియల కార్యక్రమాన్ని చూసిన వారికి సహజంగానే తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
భారత్‌లో స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం సందర్భంగా 21 తుపాకులతో త్రివర్ణ పతాకానికి వందనం సమర్పిస్తుంటారు. ఇది ఒక రకమైన సైనిక వందనం. 16వ శతాబ్ధంలో బ్రిటన్ నావికాదళం దీనిని ప్రారంభించింది. ఇందుకు శతఘ్నులు లేదా తుపాకులను వాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయి. సాధారణంగా దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటిల్లో సందర్భానికి అనుగుణంగా 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనాలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, అత్యంత సీనియర్ సైనికాధికారులకు 21 తుపాకుల వందనం ఇస్తారు. త్రివిధ దళాధిపతులకు 17తుపాకుల వందనం ఇస్తారు.
ప్రస్తుత సీడీఎస్ బిపిన్ రావత్ ఫోర్‌స్టార్ జనరల్. ఆయన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌తో సమానమైన ర్యాంక్. కానీ వీరందరిలో ప్రథముడిగా వ్యవహరిస్తున్నారు. అందుకే 17 తుపాకుల వందనం ఆయనకు సమర్పించారు. ఇది దేశం తరఫున ఆయనకు అంతిమంగా ఇచ్చే వందన సమర్పణ.
#WATCH | Delhi: #CDSGeneralBipinRawat laid to final rest with full military honours, 17-gun salute. His last rites were performed along with his wife Madhulika Rawat, who too lost her life in #TamilNaduChopperCrash.
Their daughters Kritika and Tarini performed their last rites. pic.twitter.com/uTECZlIhI0
— ANI (@ANI) December 10, 2021
అంతకు ముందు ఈ ఉదయం జనరల్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ భౌతికకాయాలను ప్రజల చివరి సందర్శనార్థం వారి నివాసంలో ఉంచారు. జనరల్ రావత్‌కు నివాళులర్పించేందుకు హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా కేంద్ర కేబినెట్ సభ్యులు వచ్చారు. వీరితో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా జనరల్ రావత్‌కు నివాళులర్పించారు. అనంతరం ఆయన అంతిమ యాత్ర మొదలైంది. జనరల్ రావత్ చివరి పర్యటన భావోద్వేగపూరితంగా సాగింది. ఆర్మీ అధికారి చివరి సందర్శనకు ఇంతమంది జనం రావడం చాలా అరుదు. దారి పొడవునా పూలవర్షం కురిపించి మృతదేహంతో పాటు త్రివర్ణ పతాకంతో పరుగులు తీశారు. నినాదాలు చేస్తూ ఆయన అంతిమ యాత్ర వెంట ప్రజలు పరుగులు తీసిన దృశ్యం చూసిన వారిని భావోద్వేగాలలో ముంచేసింది. అంతిమ యాత్ర దారిపొడవునా జనరల్ బిపిన్ రావత్ అమర్ రహే.. అనే నినాదాలతో రహదారులు మారుమోగాయి. ఇక అంత్యక్రియల సమయంలో కూడా ఆర్మీ కాంట్ భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది.
ఇవి కూడా చదవండి: Indian Railways: ఇక రైళ్లలో ప్రయాణిస్తే.. విమానం తరహా సదుపాయాలు.. ప్రయాణీకులను పలకరించనున్న హోస్టెస్‌లు!
Fine on Amazon: ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే..
LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!