తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి, దేశానికి, భూగోళానికి విజ్ఞాన సముపార్జన చేసిన పీవీకి లభించిన గౌరవం ఇది. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి కీలక పాత్ర పోషించారు పీవీ.
ఇటు గొప్ప సంస్కరణశీలి, బహు భాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పీవీ ఠీవి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వేడుకులు నిర్వహిస్తోంది. పీవీ గొప్పతనం తర తరాలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నవభారత నిర్మాతల్లో ఆద్యుడు నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పీవీ పేరు పెట్టాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.