Government Blocked 296 Mobile Apps: దేశ భద్రత, సౌర్వ భౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకుని పలు మొబైల్ యాప్‌లను నిషేధిస్తున్నామని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రే అన్నారు. 2014 నుంచి దేశంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 296 యాప్‌లను నిషేధించినట్లు చెప్పారు. ఐటీ చట్టం 2000లో ఉన్న 69ఏ సెక్షన్ ప్రకారం ఆ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని యాప్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. యూజర్లకు చెందిన ఫైనాన్షియల్ డేటాను దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించినట్లు చెప్పారు.
అలాగే గత ఏడాది బ్యాకింగ్‌లో సుమారు 2.9 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు అయినట్లు చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) తన డేటాలో ఈ విషయాన్ని పొందు పర్చింది. అయితే రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి సంజయ్ దోత్రే ఈ విషయాన్ని వెల్లడించారు.
డిజిటల్ బ్యాంకింగ్ అంశంలో 2018లో 1,59,761, 2019లో 2,46,514,2020లో 2,90,445 కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు. ఫిషింగ్ అటాక్స్, నెట్ వర్క్ స్కానింగ్, వైరస్‌లు, వెబ్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలు జరిగినట్లు ఆయన తెలిపారు.
Also Read:
COVID-19 Variants: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల కొత్త కరోనా రకాలు