Aadhaar Card Food Menu: పెళ్లికి వచ్చిన వారు ఆ కార్డును చూసి అవాక్కయ్యారు.. ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల జాబితా

Aadhaar Card Food Menu: ఇటీవల కాలంలో వివాహం చేసుకునే జంటలు ఏదో ఒక విధంగా ప్రత్యేకతను చాటుతూ అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా ఓ జంట కూడా ఆ...

Aadhaar Card Food Menu: పెళ్లికి వచ్చిన వారు ఆ కార్డును చూసి అవాక్కయ్యారు.. ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల జాబితా
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2021 | 6:02 PM

Aadhaar Card Food Menu: ఇటీవల కాలంలో వివాహం చేసుకునే జంటలు ఏదో ఒక విధంగా ప్రత్యేకతను చాటుతూ అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా ఓ జంట కూడా ఆ జాబితాలో చేరింది. డిజిటల్‌ ఇండియాకు మద్దతు ఇచ్చేందుకు ఈ నూతన వధువరులు విభిన్నంగా ఆలోచించారు. తమ వివాహ విందు మెనూను ఆధార్‌ కార్డు రూపంలో ముద్రించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారు దానికి చూసి అవాక్కయ్యారు.

కోల్‌కతాలోని రాజర్‌హాట్‌ ప్రాంతానికి చెందిన వరుడు గోగోల్‌ సాహా, వధువు సుబర్ణదాస్‌ల వివాహం ఈనెల 1న జరిగింది. డిజిటల్‌ ఇండియాకు మద్దతిచ్చే వధువరులు.. పెళ్లి భోజనం మెనూ కార్డు వినూత్నంగా ఉండాలని భావించారు. ఆలోచన వచ్చేందే ఆలస్యం.. వివాహ విందు వంటకాలను ఆధార్‌ కార్డు రూపంలో ముద్రించారు. డైనింగ్‌ టేబుల్స్‌ వద్ద ఉన్న ఈ వినూత్నంగా ముద్రించిన ఆధార్‌ కార్డు మెనూను చూసి పెళ్లికి వచ్చిన వారు ఆశ్యర్యపోయారు. ఇటీవల కాలంలో ప్రతిదానికి ఆధార్‌ కార్డు అడుగుతుండటంతో పెళ్లికి కూడా హాజరు కావాలంటే ఆధార్‌ కార్డు కావాలేమో అంటూ కొందరు నవ్వుతూ కామెంట్లు చేశారు. కొందరేమో మా ఆధార్‌ కార్డు డైనింగ్‌ టేబుల్‌ మీద మర్చిపోయామంటూ చమత్కరించారు.

ఈ వినూత్న వివాహ విందు మెనూ కార్డు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో వైపు ఈ క్రెడిట్‌ అంతా తన భార్య సుబర్ణకు దక్కుతుందని వరుడు గోగోల్‌ చెప్పుకొచ్చాడు. తామిద్దరం డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని, ఈ నేపథ్యంలోనే దీని గురించి ఆహ్వానితులకు అవగాహన కల్పించేందుకు వధువు ఈ వినూత్న ఐడియా ఇచ్చిందని వరుడు చెప్పుకొచ్చాడు. వివాహానికి వచ్చిన వారంతా దీని గురించి మాట్లాడుకోవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు.

Also Read: Post Office Monthly Income Scheme: అదిరిపోయే బెనిఫిట్.. పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల ఆదాయం

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ