రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

| Edited By:

Sep 08, 2020 | 11:37 AM

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో క్లోన్(సమాంతర రైళ్లు) ట్రైన్స్‌ని నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌
Follow us on

Railway Passengers Clone Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో క్లోన్(సమాంతర రైళ్లు) ట్రైన్స్‌ని నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండి, వెయిటింగ్ లిస్ట్‌ ఎక్కువగా ఉన్న రూట్లలో ఈ రైళ్లను నడపాలనుకుంటున్నట్లు క్లోన్ ట్రైన్స్‌ని నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ అన్నారు. దీనివలన ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా హాయిగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చునని ఆయన తెలిపారు. కాగా సాధారణ రైళ్లతో పోలిస్తే క్లోన్ రైళ్లకు హాల్టింగులు తక్కువగా ఉంటాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 12 నుంచి భారత రైల్వే శాఖ 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సెప్టెంబర్ 10 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి.

Read More:

ఇది చివరిది కాదు.. సిద్ధంగా ఉండటం మంచిది: డబ్ల్యూహెచ్‌ఓ

డ్రగ్స్‌ కేసు.. నటి సంజన గల్రాని ఇంట్లో కొనసాగుతున్న సోదాలు