Corona Virus: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

|

Jun 11, 2021 | 3:22 PM

Contractual Employees: : కరోనా సృష్టించిన విధ్వసం నుంచి కోలుకుంటున్నాం.. పర్వాలేదు అనుకునే సమయంలో మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంది. దేశం సెకండ్ వేవ్ ఉధృతి..

Corona Virus: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Corona
Follow us on

Contractual Employees: : కరోనా సృష్టించిన విధ్వసం నుంచి కోలుకుంటున్నాం.. పర్వాలేదు అనుకునే సమయంలో మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంది. దేశం సెకండ్ వేవ్ ఉధృతి వణికిపోయింది. ఇక కరోనా తో ప్రజలు, సంస్థలు ఆర్ధికంగా నష్టపోయారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి కొంచెం పర్వాలేదు.. ఐతే కాంట్రాక్ట్ ఉద్యుగుల ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది. అయిదు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలను తీర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంది. వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫుల్ శాలరీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్ 19 కారణంగా విధించిన లాక్ డౌన్ ఈ కాంట్రాక్ట్ వర్కర్లు ఇంటి వద్దనే ఉండిపోయారు. దీంతో పనిదినాలు మాత్రమే శాలరీగా ఆలోచన సరికాదని.. 2021 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకూ మొత్తం జీతం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ కారణంగా ఇంటి వద్దనే ఉండిపోయిన కాంట్రాక్చువల్ ఉద్యోగులను ఆన్ డ్యూటీలో ఉన్న వ్యక్తులుగా పరిగణించాలని చెప్పింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలకు పర్మిషన్ ఇస్తూ ప్రకటన జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది. ఆఫీసర్ల కొరత ఉందని డిప్యూటీ సెక్రటరీ, డైరక్టర్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో సెంట్రల్ డిప్యూటేషన్ కోసం నియమకాలు జరపాలని ఆదేశించింది.

Also Read: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక రానున్న మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం