Gold Rates Today: గత కొద్దిరోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఈ మధ్యనే స్వల్పంగా దిగివస్తున్నాయి. మంగళవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 47,150ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 51.430 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,430 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,380 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,380 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,990 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,090 వద్ద ఉంది.
• చెన్నైలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,360 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,990 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,090 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :