Gold and Silver Cost Today: దుర్గాష్టమి వేళ మగువలకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. ఏ నగరాల్లో ఎంత ధరలున్నయంటే..

|

Oct 10, 2024 | 6:35 AM

ఈ ఏడాది చివరి మూడు నెలల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో పసిడికి డిమాండ్ నెలకొంది. పెట్టుబ‌డుల‌కు ఎన్ని ఆప్ష‌న్లు ఉన్నా.. ఎక్కువ మంది బంగారం లేదా వెండి మీదనే పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వైపు చుసిన జనం ఇప్పుడు బంగారం లేదా వెండి వంటి లోహాలపై ఆసక్తిని చూపిస్తూ ఎక్కుగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ నేడు (అక్టోబర్ 10వ తేదీ) తెలుగు రాష్ట్రాల్లో ని ముఖ్య నగరాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Cost Today: దుర్గాష్టమి వేళ మగువలకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. ఏ నగరాల్లో ఎంత ధరలున్నయంటే..
Gold And Silver Price Today
Follow us on

కొంతకాలం క్రితం వరకూ బంగారం అంటే ఆభరణాల కోసమే ఎంపిక చేసుకునే వారు. బాగారం ఒక స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు.. ఆపద సమయంలో ఆడుకునే ఒక గొప్ప విలువైన సంపదగా భావించే వారు. అందుకనే ఎ చిన్న సందర్భం వచ్చిన బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపించేవారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు బంగారం ఆభరణాల కోసమే కాదు ఒక పెట్టుబడిగా కూడా భావిస్తారు. దీంతో గత కొన్ని ఏళ్లుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. స్థిరంగా ఉండడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి మూడు నెలల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో పసిడికి డిమాండ్ నెలకొంది. పెట్టుబ‌డుల‌కు ఎన్ని ఆప్ష‌న్లు ఉన్నా.. ఎక్కువ మంది బంగారం లేదా వెండి మీదనే పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వైపు చుసిన జనం ఇప్పుడు బంగారం లేదా వెండి వంటి లోహాలపై ఆసక్తిని చూపిస్తూ ఎక్కుగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ నేడు (అక్టోబర్ 10వ తేదీ) తెలుగు రాష్ట్రాల్లో ని ముఖ్య నగరాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరమైన హైదరాబాద్ లో దుర్గాష్టమి వేళ పసిడి ధర ఎలా ఉన్నదంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 10 మేర తగ్గి రూ. 70,290లు గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ఈ రోజు రూ. 10 మేర తగ్గి రూ. 76,680లు గా కొనసాగుతోంది. ఇదే ధరలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాష్ట్రాలైన విజయవాడ, విశాఖ, పొద్దుటూర్లలో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల బంగారం ధరలు నేడు (అక్టోబర్ 10వ తేదీ)

చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 7,029లు ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 7,668
దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,029లు ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 7,668
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,044ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 7,683
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,029గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 7,668
కేరళ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,029 లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ. 7,668

ఇవి కూడా చదవండి

వెండి ధర ఎలా ఉన్నదంటే

బంగారం తర్వాత అమితంగా ఇష్టపడి కొనే లోహం వెండి. ఆభరణాలుగా మాత్రమే కాదు వస్తురుపేనా కూడా వెండిని కొనుగోలు చేస్తారు. ఇక బంగారం తర్వాత ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే లోహం వెండి. ఈ నేపధ్యంలో వెండి ధరలు కూడా హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో ఆల్ టైం హైకి చేరుకున్న వెండి .. లక్ష మార్క్ ని కూడా దాటింది. ఒక వెండి ధరను కేజీని ప్రామాణికంగా తీసుకుంటారు. దసరా పండగ శుభవేళ వెండి ధర స్వల్పంగా దిగి వచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో నేడు కేజీ వెండి ధర రూ. 100లు తగ్గి రూ. 99,900లకు చేరుకుంది. అయితే దేశ రాజధాని ధిల్లీ లో మాత్రం ఈ రోజు కేజీ వెండి ధర రూ.93,900లు గా కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..