Gold and Silver Price Today: పెళ్ళిళ్ళ సీజన్‌తో నగలకు భారీ డిమాండ్.. మళ్ళీ పెరిగిన పసిడి, వెండి రేట్లు .. ప్రధాన నగరాల్లో నేటి ధరలు..

|

Dec 06, 2024 | 7:25 AM

ఏడాది చివరి నెలకు వచ్చేశాం.. చివరి త్రైమాసికంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ అస్థిరంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ అమెరిక అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాక డాలర్ బలపడుతోంది. దీంతో దేశీయంగా బంగారం,వెండి ధరలు కొంత మేర దిగి వచ్చాయి. అయితే పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కావడంతో నగలకు డిమాండ్ నెలకొంది. దీంతో తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్ళీ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.

Gold and Silver Price Today: పెళ్ళిళ్ళ సీజన్‌తో నగలకు భారీ డిమాండ్.. మళ్ళీ పెరిగిన పసిడి, వెండి రేట్లు .. ప్రధాన నగరాల్లో నేటి ధరలు..
Gold Silver Price Today
Follow us on

 

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో పసిడి ప్రియులు నగల కొనుగోలుకి ఆసక్తిని చూపించారు. అయితే గత మూడు రోజులుగా దేశీయంగా తగ్గిన బంగారం, వెండి ధరలకు కళ్ళెం పడింది. ఈ రోజు పసిడి , వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్టుబడుదరులతో పాటు సామాన్యులు కూడా కొనుగోళ్ళపై ఆసక్తిని చూపిస్తుండడంతో మళ్ళీ పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఈ నేపధ్యంలో ఈరోజు(డిసెంబర్ 6 వ తేదీ శుక్రవారం) తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. గత కొన్ని రోజులు దేశీయంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. శుక్రవారం ఉదయం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 పెరిగింది. దీంతో ఈ రోజు రూ.77,900లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధర

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.77,900లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,410లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగారాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్, పొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధర

దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,560లుగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78, 050లకు చేరుకుంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 7,1410లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 7,7900లకు చేరుకుంది.

చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.7,1410 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 7,790లకు చేరుకుంది.

బెంగళూరు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 7,1410ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 7,790 0 లుగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర కూడా స్వల్పంగా నమోదు అయింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1200 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ఈ రోజు కిలో వెండి ధర మళ్ళీ రూ. 101,100 లకు చేరుకుంది. అయితే దేశ రాజధాని డిల్లీలో కిలో వెండి ధర రూ. 92,100లుగా కొనసాగుతోంది. అయితే బంగారం, వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పుంజుకోవడానికి కారణం పెళ్ళిళ్ళ సీజన్.. స్థానిక నగల దుకాణంలో ఉన్న డిమాండ్ అని తెలుస్తోంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..