GRMB Meeting: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ

ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

GRMB Meeting: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ
Godavari River Management Board

Updated on: Jul 30, 2021 | 10:04 PM

Godavari River Management Board: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. ఆగస్ట్ 3న జరిగే సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాష్ట్రాల సభ్యులు హాజరుకువాలని లేఖలో పేర్కొంది. సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాతో రావాలని లేఖలో జీఆర్ఎంబీ కోరింది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తొలిసారి జీఆర్ఎంబీ సమావేశమవుతోంది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నదీ యాజమాన్యపు బోర్డుకు సంబంధించిన గెజిట్ అమలు కార్యాచరణ ఖరారుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి గోదావరి నదీ యాజమాన్యపు బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో మేనేజింగ్ డైరక్టర్లు హాజరు కానున్నారు.

Read Also…

AP YSR Pension: ఆగస్ట్ 1న ఇంటింటికి వైఎన్ఆర్ పెన్షన్.. పంపిణీకి సర్వం సిద్దం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి