Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Extramarital Affair: ఓరి నాయనో.. ఆ బంధం కోసం 2 మిలియన్ల మంది ఇండియన్స్ రిజిస్టర్ చేసుకున్నారట!

ఇది నిజంగా షాకింగ్ అంశం అని చెప్పాలి. తమకు పెళ్లి అయినా.. ఇతరుల పట్ల వ్యామోహంతో రెచ్చిపోతున్నారు స్త్రీ, పురుషులు ఇరువురు. కొత్త బంధం కోసం ఏ ఛాన్స్ వచ్చినా వదలడం లేదు.

Extramarital Affair: ఓరి నాయనో.. ఆ బంధం కోసం 2 మిలియన్ల మంది ఇండియన్స్ రిజిస్టర్ చేసుకున్నారట!
Gleeden App Data
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 17, 2023 | 1:16 PM

ఇది నిజంగా షాకింగ్ అంశం అని చెప్పాలి. తమకు పెళ్లి అయినా.. ఇతరుల పట్ల వ్యామోహంతో రెచ్చిపోతున్నారు స్త్రీ, పురుషులు ఇరువురు. కొత్త బంధం కోసం ఏ ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన వివాహేతర సంబంధాలకు చెందిన ఎక్స్‌ట్రా మారిటల్ డేటింగ్ యాప్‌ ‘గ్లీడెన్’ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ యాప్‌ సబ్‌స్క్రైబర్స్ 10 మిలియన్ల మార్క్ దాటింది. అయితే, ఇందులో వింత ఏముందని మీకు సందేహం రావొచ్చు. ఉంది.. ఇందులో విశేషమే ఉంది. ఈ 10 మిలియన్ల మందిలో ఒక్క మన భారతదేశం నుంచే 2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదండోయ్.. సెప్టెంబర్ 2022 నుంచి 11 శాతం ఇండియన్ సబ్‌స్క్రైబర్స్ పెరిగినట్లు సంస్థ ప్రకటించింది. కొత్త సబ్‌స్క్రైబర్‌లలో ఎక్కువ మంది (66 శాతం) టైర్ 1 నగరాల నుండి వచ్చారని, మిగిలినవారు (44 శాతం) టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వస్తున్నారని కంపెనీ తెలిపింది.

సాధారణంగానే భారత్‌లో వివాహాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. వివాహ బంధానికి ఒక అర్థం ఉంది. కుటుంబ పెద్దలు, బంధు మిత్రుల సమక్షంలో స్త్రీ, పురుషులిద్దరూ ఒక్కటవుతారు. కానీ, కాలం మారుతున్నా కొద్ది వివాహ బంధం బీటలవారుతోంది. వివాహానికి అర్థం లేకుండాపోతోంది. అవాంఛిత కోరికలు, ఇతరుల పట్ల వ్యామోహం.. స్త్రీ, పురుషులిద్దరినీ తప్పుడు మార్గంలోకి నెట్టేస్తుంది. తాజాగా ‘గ్లీడెన్’ విడుదల చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ.

గ్లీడెన్ యాప్‌లో ఇండియన్ సబ్‌స్క్రైబర్స్ నానాటికీ పెరుగుతూనే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఒక్క 2022లోనే 18 శాతానికి పైగా సబ్‌స్క్రైబర్లు వచ్చారని తెలిపింది. డిసెంబర్ 2021లో 1.7 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఉంగా.. ప్రస్తుతం అది 2 మిలియన్లకు పైగా చేరుకుందని యాప్ ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ యాప్‌ను ప్రత్యేకంగా వివాహితుల కోసమే రూపొందించారు. ఇందులో పెళ్లి అయిన వారు మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లెక్కన 2 మిలియన్ల మంది భారత్‌కు చెందిన స్త్రీ, పురుషులు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఇప్పుడ సంచలనం సృష్టిస్తోంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ధనవంతులు, ఉన్నత ఉద్యోగులు, ఇంజనీర్లు ఉంటారని కంపెనీ తెలిపింది.

ఇక వయసు విషయానికొస్తే పురుషుల్లో ఎక్కువగా 30+, మహిళలు 26+ వర్గాల వారు ఉన్నారు. ఈ యాప్‌ను మహిళల భద్రతకు ప్రియారిటీ ఇస్తుందని తెలిపారు నిర్వాహకులు. ఈ యాప్‌లో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళా వినియోగదారులు ఉంటారని కంపెనీ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..