టీ ఆర్ పీ స్కామ్ కేసులో రిపబ్లికన్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయదలిస్తే ఆయనకు మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలని పోలీసులను బాంబేహైకోర్టు ఆదేశించింది. ఆయన ఇన్వెస్టిగేషన్ ను ఎదుర్కోవాల్సిందేనని, ఏ ప్రత్యేక స్టేటస్ ను పొందజాలడన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను కోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తులు షిండే, మనీష్ పిటాలేలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశిస్తూ పోలీసులు మూడు నెలలుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు గానీ ఇందులో అర్నాబ్ ను నిందితునిగా నిరూపించలేకపోరని పేర్కొంది. పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో ఆయనను అనుమానితునిగా పేర్కొన్నారని, అందువల్ల అయన తలపై ‘అరెస్టు కత్తి వేలాడుతోందని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా-ఎవరినో ఒకరిని ఖాకీలు తమ ఛార్జ్ షీట్ లో కేవలం అనుమానితునిగా పేర్కొనేందుకు క్రిమినల్ లా అనుమతించడం లేదని అర్నాబ్ తరఫు లాయర్ అశోక్ ముందర్జీ అన్నారు. 2018 నాటి అన్వయ్ నాయక్ సూసైడ్ కేసులో అర్నాబ్ గోస్వామిని నిందితునిగా పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రిపబ్లిక్ టీవీ పైన, ఏ ఆర్ జీ ఔట్ లైనర్ మీడియాకు చెందిన ఇతర ఉద్యోగులపైనా జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ స్టేట్ మెంటును హైకోర్టు అనుమతించింది. ఈ ఇన్వెస్టిగేషన్ 12 వారాల్లోగా ముగించాలని ఆదేశించింది,
అయితే ఈ దర్యాప్తును సవాలు చేస్తూ అర్నాబ్, ఇతర సిబ్బంది పలు పిటిషన్లను దాఖలు చేశారు. 2018 లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారని అర్నాబ్ గోస్వామిపై ఆరోపణలు రావడం, మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనను ఇంటి నుంచి లాక్కుని వెళ్లి వ్యాన్ లో కుదేశారని అర్నాబ్ లోగడ ఆరోపించారు. మొదట అయన బాంబే హైకోర్టుకు, ఆ తరువాత సుప్రీంకోర్టుకు ఎక్కారు .
మరిన్ని ఇక్కడ చదవండి: Rang De Grand Release Event Live: ఘనంగా ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. టీవీ9 లో లైవ్ వీడియో….
Sultan Trailer: రౌడీలయితే భయపడాలా ? అంటున్న రష్మిక.. ఆకట్టుకుంటున్న కార్తి ‘సుల్తాన్’ ట్రైలర్..